| Daily భారత్
Logo




మాదక ద్రవ్యాల నియంత్రణకు సమన్వయంతో పనిచేయాలి : జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

News

Posted on 2026-04-04 17:50:27

Share: Share


మాదక ద్రవ్యాల నియంత్రణకు సమన్వయంతో పనిచేయాలి : జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

విద్యాసంస్థలలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలి

గంజాయి సాగు చేస్తే రైతు పథకాలు రద్దు

డైలీ భారత్, మహబూబాబాద్ : మాదక ద్రవ్యాల నియంత్రణకు క్షేత్రస్థాయిలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ స్నేహ శబరీష్ అన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని *కలెక్టర్‌ స్నేహ శబరీష్* అన్నారు. 

శనివారం కలెక్టరేట్‌లో  సంబంధిత అధికారుల తో కలిసి జిల్లాస్థాయి నార్కో సమన్వయ సమావేశం నిర్వహించారు.

జిల్లాలో నమోదవుతున్న ఎన్‌డీపీఎస్‌ కేసులు, గంజాయి సాగు నివారణ చర్య లు, మాదకద్రవ్యాల వాడకం నియంత్రణ చర్యలు, మాదకద్రవ్యాల నివారణ కోసం శాఖల వారీగా చేపట్టాల్సిన పనులు, డ్రగ్స్‌ వినియోగం వల్ల కలిగే నష్టాలు చేయాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. 

మాదక ద్రవ్యాల నిర్మూలన వాల్‌పోస్టర్‌లు, హ్యాండ్‌బుక్‌లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎక్కడైనా గంజాయి సాగు జరుగుతుందో పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలు ముగిసిన సందర్భంలో పరిసరాల్లో ఉన్న పాన్‌షాప్‌ వంటి వాటిపై నిఘా పెట్టాలని అన్నారు. జిల్లాలో ఎక్కడా బహిరంగంగా మద్యం సేవించకుండా చూడాలన్నారు. ప్రతి మండలంలో తహసీల్దార్‌, ఎంపీడీవో, పోలీస్‌, మండల వ్యవసాయ అధికారి, వైద్యాధికారులు పంచాయతీ కార్యదర్శు లతో సమావేశం నిర్వహించి డ్రగ్స్‌ నియంత్రణ ప్రణాళిక రూపొందిం చాలన్నారు. 

జిల్లాలో ఉన్న సినిమా థియేటర్ల పరిసరాలను రాత్రి సమ యాల్లో తనిఖీలు చేయాలని కలెక్టర్‌ సూచించారు. జిల్లాలో ఉన్న బార్‌ లు, వైన్‌షాప్‌లు, ప్రభుత్వ నిర్ధేశిత సమయపాలన పాటించేలా చూడా లన్నారు. బార్‌ నిర్వహాకులతో వాట్సాప్‌ గ్రూప్‌ తయారుచేసి ప్రతిరోజు ఎప్పుడు మూసివేస్తున్నారో సమాచారం అందించాలన్నారు. డ్రగ్స్‌ ని యంత్రణపై విస్తృతంగా ప్రచారం కల్పించాలని డ్రగ్స్‌, గంజాయి వల్ల కలిగే నష్టాలను వివరించే వీడియోలు, పోస్టర్‌లు ప్రదర్శించాలని, అవగాహన కల్పించాలన్నారు. డ్రగ్స్‌ పరీక్షల నిర్వహణకు అవసరమైన యూరిన్‌ కిట్‌లను పోలీస్‌లు, ఎక్సైజ్‌ శాఖ అధికారుల వద్ద అందుబా టులో ఉంచాలని డీఎంహెచ్‌వోకు సూచించారు. రైస్‌మిల్లులు, ఇటుక బట్టీల వద్ద కార్మిక అధికారి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.

జిల్లావ్యాప్తంగా ఉన్న ఎస్సీ , ఎస్టి బీసీ మైనార్టీ, సంక్షేమ వసతి గృహాలు పాఠశాలలలో ప్రత్యేక నిఘా పెట్టి అవగాహన ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, జూనియర్ కళాశాలలో విద్యార్థుల యొక్క మానసిక ఆరోగ్య స్థితిగతులను గమనిస్తూ ఉండాలని,

జిల్లాలోని రైతులు రహస్యంగా ఏమైనా గంజాయిని సాగు చేస్తే వారికి లభించే రైతు భరోసా, రైతుబంధు, రైతు బీమా తదితర పథకాలను రద్దు చేస్తామని హెచ్చరించారు, 

మాదకద్రవ్యాల నిరోధక విభాగం జిల్లాలో పూర్తిస్థాయిలో పనిచేయాలని అందుకు సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు, 

డిఅడేక్షన్ సెంటర్ ఏర్పాటు కోసం స్థలం పరిశీలన సేకరణ చేయాలని సూచించారు,

జిల్లాలోని అన్ని మండలాలు గ్రామాలలో ఉన్నటువంటి మెడికల్ షాపులలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు,

ఈ సమావేశంలో రెవెన్యూ డివిజన్ అధికారులు మహబూబాబాద్, తొర్రూరు  కృష్ణవేణి, జడ్పీ సీఈవో పురుషోత్తం, గణేష్, డీఎస్పీ తిరుపతిరావు, ఎక్సెస్ సూపర్డెంట్ కిరణ్ కుమార్, డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉమారాణి, వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవి రాథోడ్,  విద్యాశాఖ అధికారి రాజేశ్వర్, ఇంటర్మీడియట్ అధికారి మదర్, ట్రైబల్, ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అధికారులు దేశీ రామ్ నాయక్, శ్రీనివాస్, శ్రీనివాస్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Image 1

కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-08-09 18:12:44

Readmore >
Image 1

వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!

Posted On 2026-08-09 12:53:35

Readmore >
Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >