Posted on 2026-04-06 15:12:02
డైలీ భారత్, కామారెడ్డి: టీఎన్జీవోస్ రాష్ట్ర సంఘం రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భాన్ని పురస్కరించుకొని టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ పక్షాన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ గారిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ముజీబు హుస్సేనీ మరియు నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులను హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘనంగా సన్మానించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎన్జీవోస్ కేంద్ర సంఘం యొక్క పోరాటాల ద్వారానే ఉద్యోగుల హక్కులను సాధించుకోగలుగుతున్నామని రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ ఆకాంక్షలను తీర్చడంలో, ఉద్యోగుల హక్కులను సాధించడంలో అలుపెరుగని పోరాటం చేస్తుందని, రాష్ట్ర సంఘం బలంగా ఉండాలంటే జిల్లా సంఘాల సహకారం అవసరమని రాష్ట్ర సంఘం ఇచ్చే ప్రతి పిలుపుకు జిల్లా సంఘాల స్పందిస్తూ ఉద్యోగుల మధ్య ఐక్యతను మిమ్మల్నిస్తూ సంఘం యొక్క కార్యక్రమాలకు జిల్లా శాఖ తరపున సహకారం అందించాలని రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ కోరడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి , జిల్లా కార్యదర్శి ముల్క నాగరాజు సహా అధ్యక్షులు మామిళ్ల చక్రధర్, కేంద్ర సంఘ బాధ్యులు శివకుమార్ జిల్లా సంయుక్త కార్యదర్శి అబ్దుల్ ఖదీర్ బాన్సువాడ యూనిట్ కార్యదర్శి అజీముద్దీన్ ఉపాధ్యక్షులు రవి మరియు కోశాధికారి అబ్దుల్ రజాక్ పంచాయతీ సెక్రటరీల ఫోరం జిల్లా కార్యదర్శి ప్రవీణ్ ఇరిగేషన్ శాఖ బాధ్యులు భీమ రాజ్ మరియు తదితరులు పాల్గొన్నారు.
"నెలకొక మంచి పని... కామారెడ్డి విద్యార్థి రశ్వంత్‌కు 10వ నారాయణ సేవ"
Posted On 2026-08-10 03:31:22
Readmore >
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >