| Daily భారత్
Logo




రేషన్ బియ్యం అక్రమ నిల్వలపై జిల్లా సిసిఎస్ పోలీసుల దాడి

News

Posted on 2026-04-06 15:10:57

Share: Share


రేషన్ బియ్యం అక్రమ నిల్వలపై జిల్లా సిసిఎస్ పోలీసుల దాడి

12 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో జిల్లా సి.సి.ఎస్ పోలీస్ బృందం విశ్వసనీయ సమాచారంతో నిర్వహించిన దాడిలో రేషన్ బియ్యం అక్రమ నిల్వను గుర్తించి స్వాధీనం చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే, కామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీలో షేక్ ఆధిల్ (తండ్రి: షేక్ యూనుస్) పీడీఎస్ (రేషన్) బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నాడనే సమాచారం అందడంతో సి.సి.ఎస్ (CCS) పోలీసులు వెంటనే దాడి నిర్వహించారు. ఈ దాడిలో సుమారు 12 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకుని సీజ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడిపై కామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, “పేదలకు ప్రభుత్వం అందించే రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించడం తీవ్రమైన నేరం. ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదు. ఎవరు అయినా సరే కఠిన చర్యలు తప్పవు,” అని హెచ్చరించారు.

అలాగే ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, రేషన్ బియ్యం అక్రమ రవాణా లేదా నిల్వలపై ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.

Image 1

"నెలకొక మంచి పని... కామారెడ్డి విద్యార్థి రశ్వంత్‌కు 10వ నారాయణ సేవ"

Posted On 2026-08-10 03:31:22

Readmore >
Image 1

కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-08-09 18:12:44

Readmore >
Image 1

వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!

Posted On 2026-08-09 12:53:35

Readmore >
Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >