| Daily భారత్
Logo




2020 లాకప్ డెత్ కేసు.. ఏకంగా 9 మంది పోలీసులకు మరణశిక్షలు

News

Posted on 2026-04-06 22:46:59

Share: Share


2020 లాకప్ డెత్ కేసు.. ఏకంగా 9 మంది పోలీసులకు మరణశిక్షలు

డైలీ భారత్, మధురై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2020 నాటి సత్తాంకుళం తండ్రీకొడుకుల లాకప్ డెత్ కేసులో మధురైలోని ఒకటో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులుగా తేల్చి 9 మంది పోలీసులకు మరణశిక్ష (డబుల్ డెత్ సెంటెన్స్​) విధించింది.

తమిళనాడు తూత్తుకుడి జిల్లా సత్తాంకుళంలో ఉండే జయరాజ్​, అతని కుమారుడు బెనిక్స్​ స్థానికంగా ఓ మొబైల్ షాపు నడుపుతుండేవారు. అయితే కొవిడ్​-19 లాక్​డౌన్ నిబంధనలను ఉల్లంఘించి షాపు తెరిచారనే ఆరోపణలో 2020 జూన్​ 19న సత్తాంకుళం పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో తన తండ్రిని పోలీసులు కొడుతుండటంతో బెనిక్స్‌ అడ్డుకున్నాడు. దీంతో అతడిని కూడా అరెస్టు చేశారు. అనంతరం ఇద్దరినీ రాత్రంతా పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు. మరుసటి రోజు ఉదయం ఒక పారిశుద్ధ్య కార్మికుడితో రక్తాన్ని శుభ్రం చేయించి ఆధారాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఆ తరువాత తండ్రీకొడుకులపై 5 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు, వారిద్దరినీ కోర్టులో హాజరుపరిచి కోవిల్​పట్టి సబ్​జైలుకు తరలించారు. అయితే అంతకు ముందు పోలీసులు తీవ్రంగా కొట్టడంతో తండ్రీకొడుకులు జూన్​ 23న కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే మరణించారు. పోలీసు కస్టడీలో ఈ మరణాలు సంభవించడంతో సత్తాంకుళం ప్రాంతంలో తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీశాయి. వ్యాపార సంఘాలు స్వచ్ఛందంగా షాపులు మూసివేసి పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి

ఈ కేసుపై సుమోటోగా విచారణ చేపట్టిన మద్రాస్‌ హైకోర్టు దర్యాప్తు చేపట్టాలని సీబీఐని ఆదేశించింది. ఆనాటి సత్తాంకుళం ఇన్స్పెక్టర్ శ్రీధర్, సబ్-ఇన్స్పెక్టర్లు బాలకృష్ణన్, రఘు గణేశ్లతో సహా మొత్తం 10 మంది పోలీసులపై సీబీఐ కేసు నమోదు చేసింది. విచారణ సమయంలో ఒక పోలీసు అధికారి కొవిడ్‌ కారణంగా మృతిచెందారు. బాధితులు లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించలేదని, వారిపై పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారని సీబీఐ దర్యాప్తులో తేలింది. బాధితుల గాయాల నుంచి కారుతున్న రక్తాన్ని వారితోనే తుడిపించినట్లు విచారణలో వెల్లడైంది. 2020 సెప్టెంబరులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. 2022లో అదనపు ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది. తొలుత రాష్ట్ర పోలీసులు ఈ కేసును విచారణ చేశారు. అనంతరం హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు బదిలీ చేశారు. సీబీఐ అధికారులు సమగ్ర విచారణ జరిపి 2500 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేశారు. మధురై జిల్లా మొదటి అదనపు సెషన్స్ కోర్టులో ఐదేళ్లకు పైగా ఈ కేసు విచారణ జరిగింది. వాటి ఆధారంగా దర్యాప్తు చేపట్టిన మధురై జిల్లా కోర్టు గతనెల 23న 9 మంది పోలీసులను దోషులుగా తేల్చింది.

శిక్ష వివరాలను మార్చి 30న వెల్లడిస్తామని హైకోర్టు తెలిపింది. అయితే మార్చి 30న విచారణ సందర్భంగా, దోషులకు విధించాల్సిన శిక్షపై నివేదికలు సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను న్యాయమూర్తి ఆదేశించారు. కాగా, ఏప్రిల్ 2న సీబీఐ తన వాదనలు వినిపిస్తూ దోషులకు మరణశిక్ష విధించాలని కోరింది. జయరాజ్, బెనిక్స్ కుటుంబ సభ్యులు కూడా దోషులకు మరణశిక్ష లేదా డబుల్ లైఫ్ ఇంజ్రిజన్మెంట్ (జీవిత ఖైదు) వంటి కఠిన శిక్ష వేయాలని విన్నవించారు. దీంతో న్యాయమూర్తి ముత్తుకుమారన్ ఈ రోజు( ఏప్రిల్ 6న) నిందితులైన తొమ్మిది మంది పోలీసులను దోషులుగా నిర్ధరిస్తూ తీర్పునిచ్చారు. వాస్తవానికి మొత్తం 10 మంది పోలీసులపై హత్య కేసు నమోదు కాగా, వారిలో ఎస్ఎస్ఐ పాల్దురై కొవిడ్-19తో మరణించారు. మిగిలిన 9 మందిపై మధురై కోర్టు తాజాగా మరణశిక్ష విధించింది.

బాధితుల కుటుంబ సభ్యురాలైన పెర్సీ కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. "ఈ కేసులో కోర్టు మాకు న్యాయం చేసింది. మేము న్యాయస్థానంపై పూర్తి నమ్మకంతో ఉన్నాం. ఇకపై మేము అనుభవించినటువంటి బాధను మరెవరూ అనుభవించకూడదు. ఇందుకోసమే మేము ఇంతకాలం పోరాడాం. ఇలాంటి ఘటనలు మరెప్పుడూ పునరావృతం కావని మేము ఆశిస్తున్నాం" అని అన్నారు.

Image 1

మేము కొన్ని తప్పులు చేశాము

Posted On 2026-04-12 22:37:33

Readmore >
Image 1

జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-04-12 18:47:01

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు

Posted On 2026-04-12 18:45:08

Readmore >
Image 1

సింగర్ ఆశా భోంస్లే కన్నుమూత

Posted On 2026-04-12 16:53:08

Readmore >
Image 1

భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు

Posted On 2026-04-12 13:50:08

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు

Posted On 2026-04-12 12:39:23

Readmore >
Image 1

భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-04-12 12:10:38

Readmore >
Image 1

పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-12 11:41:31

Readmore >
Image 1

శీర్షిక : ఆడది ఆటబొమ్మ కాదు-- మంజుల పత్తిపాటి

Posted On 2026-04-12 08:16:03

Readmore >
Image 1

డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే

Posted On 2026-04-11 22:48:59

Readmore >