Posted on 2026-04-07 13:09:21
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఔట్‌పేషెంట్ విభాగంలో రోగులతో మాట్లాడి సేవలు, సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు. మహిళల వార్డు సహా పేషెంట్ వార్డులను పరిశీలించి రోగుల సంరక్షణపై ఆరా తీశారు.
ల్యాబ్‌ను తనిఖీ చేసి పరీక్షల నిర్వహణ, రిజిస్టర్‌ను పరిశీలించారు. మందుల గది, స్టాక్ రిజిస్టర్‌ను తనిఖీ చేసి అవసరమైన ఔషధాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
ఆరోగ్యశ్రీ సేవల అమలుపై వివరాలు సేకరించి అర్హులైన ప్రతి రోగికి సమయానికి సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రేడియాలజీ, స్కానింగ్, ఎక్స్-రే విభాగాల్లో ఆలస్యాలపై ఆరా తీసి, టెక్నీషియన్‌ల కొరత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పేషెంట్ వార్డుల్లో రోగులకు అందించే ఆహారాన్ని పరిశీలించి, నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పోషకాహారంలో అరటిపండ్లు, గుడ్లు అందించకపోవడాన్ని ప్రశ్నించి, ప్రభుత్వం నిధులకు అనుగుణంగా నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు.
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >