Posted on 2026-04-08 02:37:22
డైలీ భారత్, మధ్యప్రదేశ్: వ్యక్తిగత స్వేచ్ఛ, వైవాహిక సంబంధాల విషయంలో మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక కీలక తీర్పునిచ్చింది. భర్తతో విభేదాలు, వయసులో భారీ తేడా ఉన్న నేపథ్యంలో, ఒక వివాహిత తన ఇష్టానుసారం ప్రియుడితో కలిసి వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతించింది.వివరాల్లోకి వెళితే... తన భార్యను అనూజ్ కుమార్ అనే వ్యక్తి అపహరించాడని ఆరోపిస్తూ, ఆమె భర్త అవదేశ్ మధ్యప్రదేశ్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ క్రమంలో పోలీసులు సదరు యువతిని, ఆమె ప్రియుడిని కోర్టు ముందు హాజరుపరిచారు.కోర్టులో విచారణ సందర్భంగా ఆ యువతి తన గోడును వెళ్లబోసుకుంది. తన వయస్సు 19 ఏళ్లు కాగా, భర్త వయస్సు 40 ఏళ్లని, తమ మధ్య 21 ఏళ్ల వ్యత్యాసం ఉందని తెలిపింది. తన వైవాహిక జీవితం సంతోషంగా లేదని, భర్త ప్రవర్తన సరిగ్గా లేదని ఆమె కోర్టుకు వివరించింది. కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ, ఆమె తన భర్తతో వెళ్లేందుకు నిరాకరించి, ప్రియుడితోనే ఉంటానని కచ్చితంగా చెప్పింది.యువతి మేజర్ కావడంతో ఆమెకు తన జీవిత భాగస్వామిని లేదా ఎవరితో ఉండాలో నిర్ణయించుకునే హక్కు ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది. ఆమె అభ్యర్థనను మన్నిస్తూ, ప్రియుడితో వెళ్లేందుకు అనుమతినిస్తూ తీర్పు వెలువరించింది
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >