Posted on 2026-04-08 13:44:22
డైలీ భారత్, భూపాలపల్లి జిల్లా: జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపిఎస్ ఆదేశాల మేరకు భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండలం కొయ్యూరు పోలీస్‌లు అక్రమ గుడుంబా తయారీపై ప్రత్యేక దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో భాగంగా మల్హర్ మండలం కొండంపేట గ్రామానికి చెందిన కొరకాని సమ్మయ్య (40) అక్రమంగా గుడుంబా తయారు చేస్తుండగా పట్టుబడ్డాడు. అతని వద్ద నుండి 20 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకొని, సుమారు 600 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు.
అలాగే అదే గ్రామానికి చెందిన చీర్ల రాజేశ్వరి (50) గుడుంబా తయారు చేస్తుండగా పట్టుబడింది. ఆమె వద్ద నుండి 10 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకొని, సుమారు 50 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు.
ఈ ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్రమ గుడుంబా తయారీ మరియు విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.
కొయ్యూరు ఎస్ఐ నరేష్ మాట్లాడుతూ, ప్రజలు ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు.
సామాన్యుడికి భారీ ఊరట... యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితమే...
Posted On 2026-08-11 07:54:33
Readmore >
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >