Posted on 2026-04-09 14:28:28
డైలీ భారత్, కామారెడ్డి:పట్టణానికి చెందిన ప్రముఖ శిశు వైద్య నిపుణుడు, జనని హాస్పిటల్‌లో సీనియర్ పీడియాట్రిషన్‌గా సేవలందిస్తున్న డాక్టర్ ఈ. అరవింద్ కుమార్ గౌడ్ ని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (TGMC) లోని కంటిన్యూయింగ్ ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ (CPD) కమిటీకి కో-ఆప్టెడ్ సభ్యునిగా నియమించారు.
నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) మార్గదర్శకాల ప్రకారం, రాష్ట్రంలో వైద్యులు తమ జ్ఞానాన్ని నిరంతరం నవీకరించుకోవడం తప్పనిసరి. ఈ క్రమంలో ప్రతి వైద్యుడు ప్రతి సంవత్సరం 5 క్రెడిట్ పాయింట్లు (సుమారు 40 గంటలు) కలిగిన CPD కార్యక్రమాలలో పాల్గొనాల్సి ఉంటుంది.
CPD కమిటీ ద్వారా ప్రొఫెషనల్ సంస్థలు, బోధనా సంస్థలకు అక్రెడిటేషన్ ఇవ్వబడుతుంది. ఈ కార్యక్రమాల ద్వారా వైద్యులు తాజా వైద్య పరిజ్ఞానం, ఆవిష్కరణలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మెడికో-లీగల్ అంశాలపై అవగాహన పెంపొందించడంపై కూడా కమిటీ దృష్టి సారిస్తోంది.
డాక్టర్ అరవింద్ కుమార్ గౌడ్ నియామకంపై వైద్య వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-11 13:57:25
Readmore >