| Daily భారత్
Logo




ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యోగా తరగతి నిర్వహణ

News

Posted on 2026-04-10 14:50:34

Share: Share


ప్రజా పాలన  ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యోగా తరగతి నిర్వహణ

డైలీ భారత్, కామారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “ప్రజా ప్రణాళిక – ప్రగతి పాలన 99 రోజుల కార్యాచరణ”లో భాగంగా, హోమియోపతి & ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం కామారెడ్డి జిల్లా యోగ కేంద్రంలో యోగా తరగతి కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి  జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (DM&HO) అధ్యక్షత వహించగా, RDO Y. V. గిరి, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్, జిల్లా స్థాయి అధికారులు వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, “ప్రగతి పాలన అనేది కేవలం మౌలిక సదుపాయాల అభివృద్ధి మాత్రమే కాకుండా ప్రజల ఆరోగ్యాభివృద్ధి కూడా. ఆయుష్ వైద్యం, యోగా మన సంస్కృతిలో అంతర్భాగం. వీటిని ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత ఆరోగ్య శాఖపై ఉంది” అని పేర్కొన్నారు.

ప్రజల ఆరోగ్య సంరక్షణలో ఆయుష్ వైద్య విధానాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. యోగా, ఆయుర్వేదం, హోమియోపతి వంటి సంప్రదాయ వైద్య పద్ధతులు ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు జీవనశైలిని మెరుగుపరుస్తాయని,

ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ మెగా ఆయుష్ వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సులభంగా వైద్య సేవలు అందించడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యమని వివరించారు.

ప్రజలందరూ యోగా వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన సదస్సులో DM&HO  మాట్లాడుతూ, ఆయుష్ వైద్య విధానాల్లో హోమియోపతి, ఆయుర్వేదం, యునాని వైద్యాల ప్రాముఖ్యతను వివరించారు. ముఖ్యంగా జీవనశైలి వ్యాధులు (NCDs) నివారణలో యోగా, ప్రాణాయామం కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

అనంతరం ఆయుష్ విభాగం యోగా ఇన్‌స్ట్రక్టర్ ఆధ్వర్యంలో 45 నిమిషాలపాటు యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. ఇందులో సూక్ష్మ వ్యాయామాలు, తాడాసనం, వృక్షాసనం, భుజంగాసనం వంటి యోగా ఆసనాలు, అనులోమ-విలోమ, భ్రామరీ ప్రాణాయామాలు మరియు ధ్యానం చేయించబడింది.

కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలపాటు యోగా చేయాలని, తమ పరిధిలో ప్రజలకు యోగా ప్రాముఖ్యతను తెలియజేయాలని ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Image 1

సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు

Posted On 2026-08-12 10:06:43

Readmore >
Image 1

ఢిల్లీలో హైఅలర్ట్‌... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!

Posted On 2026-08-12 07:04:48

Readmore >
Image 1

నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!

Posted On 2026-08-12 06:40:50

Readmore >
Image 1

పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

Posted On 2026-08-12 05:16:11

Readmore >
Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >
Image 1

గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు

Posted On 2026-08-11 14:15:16

Readmore >
Image 1

జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్

Posted On 2026-08-11 14:09:26

Readmore >