Posted on 2026-04-10 17:11:31
నేరాల నివారణకు ముందస్తు నిఘా అవసరం
నైట్ పెట్రోలింగ్ ముమ్మరం.. అప్రమత్తతే నేరాల నివారణకు ఆయుధం
ప్రజల విశ్వాసమే లక్ష్యంగా పనిచేయాలి – పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ దిశానిర్దేశం
జిల్లా ఎస్పి యం రాజేష్ చంద్ర ఐపిఎస్
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్ శుక్రవారం నాడు బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్‌లోని సిబ్బంది హాజరు (రోల్ కాల్), వారి క్రమశిక్షణ మరియు సమయపాలనను స్వయంగా పరిశీలించారు. విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా, ప్రజలకు అందుబాటులో ఉంటూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తాను చెబుతున్న సూచనలు సిబ్బందికి ఏ మేరకు అర్థమయ్యాయో కూడా స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులు మరియు ఫిర్యాదుదారుల పట్ల మానవీయ కోణంలో గౌరవంగా వ్యవహరించాలని, వారి సమస్యలను ఓపికగా విని త్వరితగతిన పరిష్కరించడం ద్వారా పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మరింత పెంచాలని ఎస్పీ కోరారు. ప్రజల ఫిర్యాదుల పట్ల వేగంగా స్పందించి పరిష్కార దిశగా పనిచేయాలని స్పష్టం చేశారు. చివరగా, జిల్లాలో ఇటీవల జరుగుతున్న ఆస్తి సంబంధిత నేరాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, రాత్రి సమయాల్లో నిరంతర పెట్రోలింగ్, గస్తీ పెంచాలని, అనుమానితులపై నిశిత నిఘా ఉంచాలని బాన్సువాడ ఎస్.హెచ్.ఓ ని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడరాదని, ప్రజల భద్రతే లక్ష్యంగా పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో బాన్సువాడ డిఎస్పి విఠల్ రెడ్డి, ఎస్.హెచ్.ఓ శ్రీధర్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >