Posted on 2026-04-10 17:14:45
డైలీ భారత్, కామారెడ్డి: ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ స్వయంప్రతిపత్తి కళాశాలలో పీజీ ప్రథమ మరియు తృతీయ సెమిస్టర్ ఫలితాలను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. విజయ్ కుమార్ శుక్రవారం వెల్లడించారు. తెలంగాణ విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ సంపత్ కుమార్ ఈ పరీక్షా ఫలితాలను విడుదల చేస్తూ, విద్యార్థుల ప్రతిభను అభినందించారు.
ఈ సెమిస్టర్ ఫలితాల్లో కళాశాల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. దాదాపు అన్ని విభాగాలలో 90 శాతానికి పైగా ఉత్తీర్ణత నమోదు చేశారు
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. విజయ్ కుమార్ మాట్లాడుతూ.. "అధ్యాపకుల కృషి, విద్యార్థుల పట్టుదల వల్లే ఉత్తమ ఫలితాలు సాధ్యమయ్యాయి అని, భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించి కళాశాలకు మరింత గుర్తింపు తీసుకురావాలి" అని సూచించారు.
వైస్ ప్రిన్సిపల్ మరియు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ కె . కిష్టయ్య మాట్లాడుతూ..పరీక్షల నిర్వహణలో పారదర్శకత, క్రమశిక్షణను పాటించడం వల్ల ఫలితాలను సకాలంలో విడుదల చేయగలిగాము అని,అటానమస్ హోదా పొందిన తర్వాత విద్యా ప్రమాణాలు మెరుగుపడటమే కాకుండా, ఫలితాల్లోనూ నాణ్యత పెరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయ అదనపు పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ సంపత్, కళాశాల పరీక్షా విభాగం అధికారులు ఎన్. రాములు,ఏ.రాజేందర్ పాల్గొన్నారు.
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >