Posted on 2026-04-11 13:57:29
నేటి సమాజానికి జ్యోతిరావు పూలే ఆదర్శం
వ్యకాస జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ
డైలీ భారత్, వైరా: సామాజిక న్యాయం గురించి చెప్పటం కాదని, సామాజిక న్యాయాన్ని అమలు చేయాలని, నేటి సమాజానికి జ్యోతిరావు పూలే ఆదర్శమని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ అన్నారు. శనివారం వ్యవసాయ కార్మిక సంఘం వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో జ్యోతిరావు పూలే 199వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భూక్యా వీరభద్రం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మేరకు సత్యనారాయణ మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వ్యకాస జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ, వైరా డివిజన్ కార్యదర్శి తాళ్లపల్లి కృష్ణ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే, బిఆర్ అంబేద్కర్ జయంతులకు ఈ ప్రభుత్వాలు పూలమాలలు వేసి నివాళులు అర్పించి
సామాజిక న్యాయం, అంటరానితనం గురించి పెద్ద, పెద్ద గొప్ప మాటలు, ఉపన్యాసాలు చెప్పటం తప్ప ఆచరణలో చేసింది శూన్యం అన్నారు. మారుతున్న సమాజానికి తగ్గట్టుగా ఇంకా అంటరానితనం, దళితుల రిజర్వేషన్లు పట్ల ఇంకా వివక్షత కొనసాగుతూనే ఉందని అన్నారు. భారత సమాజం అన్ని రంగాల్లో ముందుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఊకదంపుడు ఉపన్యాసాలు చెపుతున్నారని, ఏ సామాజిక తరగతి వెనుకబాటుకు గురవుతుందో ఆ సామాజిక తరగతి అభివృద్ధి కోసం ప్రభుత్వం పథకాలు, బడ్జెట్లో కేటాయింపులు చేయడంలో వివక్షత చూపిస్తూన్నారని అన్నారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు నిరుద్యోగం, నిరుపేద కుటుంబాలు పెరుగుతున్నాయని అన్నారు. భారత సమాజంలో నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అసమానతలను పూర్తిగా నిర్మూలన చేయడానికి కేంద్ర, రాష్ట్ర పాలకవర్గాలు నిస్వార్థంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు షేక్.నాగుల్ పాషా, తెలంగాణ రైతు సంఘం పట్టణ నాయకులు కొంగర సుధాకర్, సిఐటియీ జిల్లా నాయకులు సుంకర సుధాకర్, పాపగంటి రాంబాబు, వ్యవసాయ కార్మిక సంఘం వైరా పట్టణ అద్యక్ష, కార్యదర్శులు తాటి ఏసు, గుమ్మా నరసింహారావు, నాయకులు ఓర్పు సీతారాములు, చిత్తరు మురళి, కిన్నెర మోతి అమరనేని కృష్ణ, వేల్పుల మైఖేల్, దేవుళ్ళ కృష్ణ, వల్లపు ఏడు కొండలు, మాడపాటి సుజాత, మేముగట్ల లక్ష్మయ్య, సోషల్ మీడియా వైరా డివిజన్ కన్వీనర్ గుడిమెట్ల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >
గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు
Posted On 2026-08-11 14:15:16
Readmore >
జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్
Posted On 2026-08-11 14:09:26
Readmore >