| Daily భారత్
Logo




భారీ అగ్నిప్రమాదం

News

Posted on 2026-04-12 08:40:38

Share: Share


భారీ అగ్నిప్రమాదం

డైలీ భారత్, హైదరాబాద్: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న శివరాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సర్వారెడ్డి కాలనీ గ్రీన్ ప్రాంతంలో ఉన్న ఒక గోదాంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

స్థానికుల సమాచారం ప్రకారం, ఆ గోదాంలో డెకరేషన్ సామాగ్రి నిల్వ ఉంచారు. ప్లాస్టిక్ వస్తువులు, ఫ్లెక్సీలు, థర్మాకోల్ వంటి వస్తువులు ఎక్కువగా ఉండటంతో మంటలు క్షణాల్లోనే భారీగా వ్యాపించాయి. మంటలు తీవ్రరూపం దాల్చడంతో గోదాం పక్కనే ఉన్న నివాస గృహానికి కూడా వ్యాపించాయి. పొగ దట్టంగా వ్యాపించడంతో స్థానికులు భయపడి వెంటనే తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అధికారులు సమయానికి స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ అగ్నిప్రమాదానికి గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Image 1

సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు

Posted On 2026-08-12 10:06:43

Readmore >
Image 1

ఢిల్లీలో హైఅలర్ట్‌... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!

Posted On 2026-08-12 07:04:48

Readmore >
Image 1

నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!

Posted On 2026-08-12 06:40:50

Readmore >
Image 1

పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

Posted On 2026-08-12 05:16:11

Readmore >
Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >
Image 1

గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు

Posted On 2026-08-11 14:15:16

Readmore >
Image 1

జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్

Posted On 2026-08-11 14:09:26

Readmore >