Posted on 2026-04-16 07:41:21
ప్రియుడు, సుపారీ గ్యాంగ్ తో కలిసి పాశవిక హత్య
–పరకాలలో సంచలనం
డైలీ భారత్, హనుమకొండ జిల్లా: హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన మడికొండ సుమన్ (35) ఈనెల 3వ తేదీ నుంచి కనిపించకుండా పోవడం స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.
దర్యాప్తులో బయటపడిన విషయాలు షాకింగ్‌గా మారాయి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో సుమన్‌ను అతని భార్య లావణ్య అత్యంత పాశవికంగా హత్య చేయించినట్లు పోలీసులు గుర్తించారు.
సుమన్ భార్య లావణ్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని తెలిసింది. ఈ నేపథ్యంలో భర్తను అడ్డంకిగా భావించిన లావణ్య, తన ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది.
ప్రియుడు సహా మరో 8 మంది సుపారీ గ్యాంగ్ సభ్యులను తీసుకొని ఈనెల 4న ములుగు జిల్లా దయ్యాలవాగు సమీపానికి సుమన్‌ను తీసుకెళ్లి, అతనిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. కేసు నమోదు చేసి నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >
రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్
Posted On 2026-08-08 14:28:17
Readmore >
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >