| Daily భారత్
Logo




రమేష్ గౌడ్ పై ఆరోపణలు సరికాదు

News

Posted on 2026-04-17 14:00:26

Share: Share


రమేష్ గౌడ్ పై ఆరోపణలు సరికాదు

అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం సిగ్గు చేటు

ఎస్సీ, ఎస్టీ, బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదు

డైలీ భారత్, కామారెడ్డి : జిల్లా కేంద్రంలోని ఆర్. అండ్. బి. అతిథి గృహంలో కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం  పరిధి పేట గ్రామ అంబేద్కర్ బహుజన నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బహుజన బిడ్డ అయిన పల్లె రమేష్ గౌడ్ పై కొంతమంది తమ స్వార్థం కోసం ఆరోపణలు చేస్తూ చేసిన ఫిర్యాదును వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే దళిత, బహుజనుల ఆగ్రహానికి గురికాక తప్పదని దళిత, బహుజన సంఘాల నాయకులు హెచ్చరించారు.పాల్వంచ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పల్లె రమేష్ గౌడ్ ప్రజా సేవకుడు అని, అతడు దళితులను అవమానించే వ్యక్తి కాదన్నారు. కులమతాలకు అతీతంగా అందరితో కలసి  ఉండే వ్యక్తి అని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిపై కొంతమంది తప్పుడు ఆరోపణలు చేయడం శోచనీయమన్నారు. ఆయనపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామంలో  ఏవైనా సమస్యలు ఉంటే వారు గ్రామంలో మాట్లాడుకోవాలి తప్ప ఇలా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. తనతో రాజకీయ విభేదాలు ఉంటే గ్రామంలో చూసుకోవాలే తప్ప కొంత మందిని ఉసిగొలిపి ఇలా కేసులు పెట్టించడం తగదని ఫరీద్ పేట గ్రామ సర్పంచ్ నర్సింహ రెడ్డి కి సూచించారు. గ్రామంలో ప్రతీ యేటా జరిగే సీతారాముల కళ్యాణోత్సవంలో దళితులను ప్రత్యేకంగా పిలిచి బట్టలు పెట్టి పూజలో కూర్చుండబెట్టిన రమేష్ గౌడ్ పైన దళితులను కించపరిచేలా మాట్లాడాడని ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు.  గ్రామంలో అభివృద్ధి ఎవరి ద్వారా చేశారో గ్రామంలో నిరూపించుకోవాలని గుర్తు చేశారు ఇప్పటికైనా రమేష్ గౌడ్ పై చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని లేనియెడల తమ ఇండ్లను ముట్టడిస్తామని డిమాండ్ చేశారు. అనంతరం ఏఎస్పి  చైతన్య రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సమావేశంలో దళిత, బహుజన సంఘాల నాయకులు దేవుళ్ళ రాములు, బైండ్ల రామస్వామి, విష్ణు, లక్ష్మీనర్సు, భూమవ్వ, కొంగల లక్ష్మి, రాజమణి, వరలక్ష్మి, తగిరంచ రాజిరెడ్డి, పెరుమాండ్ల నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఢిల్లీలో హైఅలర్ట్‌... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!

Posted On 2026-08-12 07:04:48

Readmore >
Image 1

నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!

Posted On 2026-08-12 06:40:50

Readmore >
Image 1

పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

Posted On 2026-08-12 05:16:11

Readmore >
Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >
Image 1

గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు

Posted On 2026-08-11 14:15:16

Readmore >
Image 1

జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్

Posted On 2026-08-11 14:09:26

Readmore >
Image 1

బిజెపి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ

Posted On 2026-08-11 14:02:10

Readmore >