| Daily భారత్
Logo




నిర్లక్ష్యపు నీడలో నలిగిన మానుకోట

News

Posted on 2026-04-23 22:03:53

Share: Share


నిర్లక్ష్యపు నీడలో నలిగిన మానుకోట

మౌలిక వసతుల లోపంతో ప్రజల ఇబ్బందులు

కలెక్టర్–ఎస్పీ చొరవతో అభివృద్ధి దిశగా అడుగులు

గిరిజన ప్రాంతం మానుకోట

డైలీ భారత్, మానుకోట:గిరిజన ప్రాంతానికి హృదయంగా నిలిచిన మానుకోట, ఒకవైపు అభివృద్ధి ఆశలతో ముందుకు సాగాలని తపిస్తుంటే, మరోవైపు నిర్లక్ష్యపు నీడలో నలిగిపోతున్న వాస్తవం ప్రజల మనసులను కలచివేస్తోంది. కాగితాలపై ఉన్న ప్రణాళికలు నేలమీద కనిపించకపోవడం ప్రజల్లో ప్రశ్నలను రేకెత్తిస్తోంది.

ఇరుకురోడ్లతో ఇబ్బందులు పడుతున్న జనం

ఉదయం రద్దీ వేళ… రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు కదిలే వాహనాల వరుసలు—పట్టణ ట్రాఫిక్ పరిస్థితిని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇరుకైన రహదారులు, ఎక్కడ చూసినా అస్తవ్యస్తంగా పార్క్ చేసిన వాహనాలు ఒక్క అడుగు ముందుకు కదలడానికి సమయం పట్టే పరిస్థితి, పార్కింగ్ స్థలాల కొరత సమస్యను మరింత తీవ్రం చేస్తోంది. పట్టణానికి ప్రాణాధారంగా ఉండాల్సిన ఈ మార్గం ఇప్పుడు ఇబ్బందుల ప్రతీకగా మారింది.

ఇది కేవలం ట్రాఫిక్ సమస్య కాదు

మానుకోట అభివృద్ధికి ఒక హెచ్చరిక. రహదారుల విస్తరణ, ప్రణాళికాబద్ధ పార్కింగ్, సమగ్ర పట్టణ రూపకల్పన—ఇవి ఇక ఆలస్యం చేయలేని అవసరాలు.

వార్డులలో డ్రైనేజీ వ్యవస్థ

అదే సమయంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. చిన్న వర్షానికే నీరు నిలిచిపోవడం, వీధులు చెరువుల్లా మారడం ప్రజల దైనందిన జీవితాన్ని కష్టతరం చేస్తోంది. స్మశాన వాటికల కొరత,& కనీస వసతులు లేక నిర్లక్ష్యానికి గురవుతుండగా, మారుమూల ప్రాంతాల్లో పేదల ఇండ్లకు ఇంటి  నంబర్లు, విద్యుత్ మీటర్లు వంటి ప్రాథమిక సదుపాయాలు అందకపోవడం అభివృద్ధి లోటును బహిర్గతం చేస్తోంది.

భద్రతా పరంగా సీసీ కెమెరాల కొరత ఉన్నప్పటికీ, మరోవైపు పోలీస్ వ్యవస్థలో కనిపిస్తున్న మార్పు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతోంది.

జిల్లా ఎస్పీ ప్రత్యేక చొరవ

జిల్లా ఎస్పీ నాయకత్వంలో మహబూబాబాద్ పోలీస్ యంత్రాంగం ప్రజల పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తూ, ఫిర్యాదులకు తక్కువ సమయంలోనే పరిష్కార మార్గాలు చూపుతున్న తీరు ప్రశంసలు అందుకుంటోంది. ప్రణాళికా బద్ధంగా జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని  ముందుకు నడిపించడం  వల్ల గంజాయి, గుడుంబా వంటి అక్రమ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇది పట్టణ భద్రతలో ఒక కీలకమైన మార్పుగా కనిపిస్తోంది.

చిరు వ్యాపారులకు ఊరట—కొత్త అవకాశాల అవసరం

పట్టణంలో చిరు వ్యాపారస్తులు, ఆటో డ్రైవర్లు తమ జీవనోపాధి కోసం రాత్రి సమయాల్లో కూడా వ్యాపారం చేసుకునే అవకాశాలు కల్పించాలని , కొద్దిగా ఆలస్యం జరిగినట్లయితే క్రింది స్థాయి పోలీస్ సిబ్బంది ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ చిరు వ్యాపారస్తులు పోలీస్ అధికారులకు పోలీస్ శాఖ సహకారంతో చిరు వ్యాపారస్తులు ఏమైనా మాకు అనుకూల వాతావరణం కల్పిస్తే, చిరు వ్యాపారస్తుల కుటుంబాలలో ఆర్థికంగా జీవనం సాగించుకునేందుకు అవకాశం కల్పించిన వారవుతారని ఆశాభావం వ్యక్తపరిస్తున్న చిరు వ్యాపారస్తులు, అదేవిధంగా, చిరు వ్యాపారస్తుల కోసం ప్రత్యేక మార్కెట్ ఏర్పాటు చేయాలని చిరు వ్యాపారస్తులు (ప్రజలు) జిల్లా అధికార  యంత్రాంగాన్ని అభ్యర్థిస్తున్నారు.

అభివృద్ధి మాటల్లో కాదు

అభివృద్ధి మాటల్లో కాదు, కార్యాచరణలో కనిపించాలి

మీటింగ్‌లు, ఫైళ్లలోనే కాకుండా నేలమీద అభివృద్ధి కనిపించాలి. ప్రతి అధికారి బాధ్యతతో పనిచేస్తేనే మార్పు సాధ్యం. పారదర్శకత కోసం జిల్లా కార్యాలయాల్లో సీసీ నిఘా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.

మారాల్సిన రహదారులు

రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ఉన్న రహదారి విస్తరించి, సక్రమ పార్కింగ్ సదుపాయాలతో రూపుదిద్దుకుంటే మానుకోట రూపురేఖలు మారిపోవడం ఖాయం, ఈ మార్గం అభివృద్ధికి ప్రతీకగా నిలవాలి.

యువతగా ఉన్న అధికారులు

జిల్లా కలెక్టర్, ఎస్పీ యువకులు వారు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయి. వేగ వంత మైన నిర్ణయాలు, ప్రణాళికా బద్ధ మైన చర్యలు—ఇవి మహబూబాబాద్ అభివృద్ధి 100% అమలులోకి వస్తుందనే నమ్మకం పెరుగుతోంది.

ప్రత్యేక దృష్టి, వేగవంతమైన అభివృద్ధి”

జిల్లా కలెక్టర్ తీసుకునే ప్రతి నిర్ణయంతో జిల్లా అభివృద్ధి ముడిపడి ఉన్నందున, వారి ఒక్క సంతకం మహబూబాబాద్ జిల్లా రూపురేఖలను మార్చే దిశగా కొనసాగుతుందని, జిల్లా ఆర్థికంగా, అభివృద్ధి దిశగా బలోపేతం జరుగుతుందని ప్రజలందరూ ప్రగాఢ విశ్వాసంతో ఎదురుచూస్తున్నారూ.

గిరిజన ప్రాంతమైన మానుకోట

నిర్లక్ష్యపు నీడ తొలగి, అభివృద్ధి వెలుగులు నిండే రోజు కోసం ఎదురుచూస్తున్న ప్రజలు.?

ఇండ్ల మహేష్

 రిపోర్టర్

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >