| Daily భారత్
Logo




నివారణ కలిగిన వ్యాధి మలేరియా

Health

Posted on 2026-04-24 13:50:12

Share: Share


నివారణ కలిగిన వ్యాధి మలేరియా

డైలీ భారత్, మహాబాబాబాద్: ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా “ప్రపంచ మలేరియా దినోత్సవం (వరల్డ్ మలేరియా డే )"ను నిర్వహించడం జరుగుతుందని మహబూబాబాద్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రవి రాథోడ్ నేడు ఒక ప్రకటన లో తెలిపారు. 2026 సంవత్సరం కు గాను  ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు  మలేరియా అంతానికి ప్రేరణ, ఇప్పుడు మనవల్ల అవుతుంది. ఇప్పుడు మనం తప్పక చేయాలి అనే నినాదాన్ని ఇవ్వడం జరిగిందన్నారు.

మలేరియా వ్యాధి  ప్రజారోగ్యానికి పెద్ద సవాలుగా ఉందని, ముఖ్యంగా వర్షాకాలంలో ఈ వ్యాధి వ్యాప్తి అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పారు.మలేరియా అనేది దోమల ద్వారా వ్యాపించే సంక్రమణ వ్యాధి.

జిల్లాలో మలేరియా కేసులను పూర్తిగా తగ్గించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది.గత సంవత్సరంతో పోలిస్తే జిల్లాలో మలేరియా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ, ఇంకా అప్రమత్తంగా ఉండడం అత్యంత అవసరం అని తెలిపారు.ఈ దినోత్సవాన్ని నిర్వహించుట యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రజల్లో మలేరియా వ్యాధి పై అవగాహన పెంచడం, దోమల నియంత్రణ చర్యలను బలోపేతం చేయడం, మరియు ప్రారంభ దశలోనే పరీక్షలు చేయించుకొని చికిత్స పొందేలా ప్రోత్సహించడం. జిల్లాలో మలేరియా నివారణకు చేపడుతున్న  చర్యల గురించి తెలుపుతూ గ్రామాలలో ఫీవర్ సర్వేలు నిర్వహించడం, అనుమానిత కేసులకు వెంటనే రక్త పరీక్షలు చేయించడం, పాజిటివ్ కేసులకు తక్షణ చికిత్స అందించడం, దోమల పెరుగుదలను అరికట్టడానికి నిల్వ నీటిని తొలగించడం, అవసరమైన చోట ఫాగింగ్  లార్విసైడల్ చర్యలు చేపట్టడం మలేరియా నివారణకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతూ ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండనీయకూడదనీ దోమతెరలు ఉపయోగించాలనీ పూర్తి చేతుల దుస్తులు ధరించాలనీ,

జ్వర లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి “మలేరియా పూర్తిగా నివారించగలిగే వ్యాధి అని ప్రజల సహకారం ఉంటే మాత్రమే ఈ వ్యాధిని నిర్మూలించవచ్చునీ , అందరూ కలిసి మలేరియా రహిత సమాజాన్ని నిర్మిద్దాం” అని తెలిపారు.

Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >
Image 1

విద్యావంతుడు ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో విద్య శూన్యం..?

Posted On 2026-08-08 16:04:38

Readmore >
Image 1

రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్

Posted On 2026-08-08 14:28:17

Readmore >
Image 1

రాజమండ్రిలో మెడికోపై తాగుబోతుల రాక్షసత్వం...

Posted On 2026-08-08 07:38:13

Readmore >
Image 1

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!

Posted On 2026-08-08 04:36:39

Readmore >
Image 1

వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

Posted On 2026-08-07 16:00:29

Readmore >