| Daily భారత్
Logo




ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

News

Posted on 2026-04-24 18:55:39

Share: Share


ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

జనగణనలో ప్రజలంతా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలి..

 జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

డైలీ భారత్, కరీంనగర్: “మన జనాభా గణన – మన అభివృద్ధి” అనే నినాదంతో జనాభా గణన 2027కు సంబంధించి ఏర్పాటు చేసిన అవగాహన ఫ్లెక్సీలను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌ వద్ధ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ, జనాభా గణన దేశంలో అతిపెద్ద ప్రజల భాగస్వామ్య కార్యక్రమమని పేర్కొన్నారు. ప్రతి ఇంటి సమాచారం నమోదు చేసుకోవడం అందరి ప్రథమ కర్తవ్యం అని స్పష్టం చేశారు. ప్రజలంతా పెద్ద ఎత్తున ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు. జనాభా గణన తొలి దశ మే 11 నుంచి జూన్ 9 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ దశలో ఎన్యూమరేటర్లు ఇండ్ల జాబితా, గణన చేపడతారని వివరించారు. దీనికి ముందు ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ప్రజలు స్వీయ గణన (Self Enumeration) చేయాలని సూచించారు. దీనికోసం (se.census.gov.in) వెబ్‌సైట్‌ను సందర్శించి స్వీయ గణన ఐడి పొందాలని తెలిపారు. అనంతరం ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్లకు ఆ ఐడిని తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలు, సందర్శకులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జనాభా గణన విజయవంతానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రణాళిక అధికారి రాం దత్తా రెడ్డి, జిల్లా సెన్సస్ అధికారి తిరుపతి పాల్గొన్నారు.

Image 1

సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు

Posted On 2026-08-12 10:06:43

Readmore >
Image 1

ఢిల్లీలో హైఅలర్ట్‌... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!

Posted On 2026-08-12 07:04:48

Readmore >
Image 1

నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!

Posted On 2026-08-12 06:40:50

Readmore >
Image 1

పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

Posted On 2026-08-12 05:16:11

Readmore >
Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >
Image 1

గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు

Posted On 2026-08-11 14:15:16

Readmore >
Image 1

జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్

Posted On 2026-08-11 14:09:26

Readmore >