| Daily భారత్
Logo




కానిస్టేబుల్‌ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు

News

Posted on 2026-04-25 17:57:36

Share: Share


కానిస్టేబుల్‌ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు

డైలీ భారత్, ఛత్తీస్‌గఢ్‌: ఒక మహిళ దారుణానికి పాల్పడింది. ప్రియుడైన కానిస్టేబుల్‌ భార్య, అతడి ముగ్గురు పిల్లలపై కత్తితో దాడి చేసింది. ఈ సంఘటనలో కానిస్టేబుల్‌ భార్య, అతడి కుమారుడు తీవ్ర గాయాలతో మరణించారు. అతడి ఇద్దరు కుమార్తెలు చికిత్స పొందుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం ఉదయం కానిస్టేబుల్ లలితేష్ యాదవ్ ప్రియురాలైన 25 ఏళ్ల సరోజిని భరద్వాజ్ అతడి ఇంటికి చేరుకున్నది. ఆ సమయంలో అతడు ఇంట్లో లేడు. తన కుటుంబం ప్రయాణం కోసం టిక్కెట్లు కొనడానికి రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు.

కాగా, కానిస్టేబుల్‌ భార్య రీనాతో సరోజిని వాగ్వాదానికి దిగింది. గొడవ బయటకు వినిపించకుండా టీవీ సౌండ్‌ పెంచింది. ఆ తర్వాత రీనా, ఆమె ముగ్గురు పిల్లలపై కత్తితో దాడి చేసింది. రీనాతో పాటు నిద్రిస్తున్న తొమ్మిదేళ్ల ఆదిత్యను పదేపదే కత్తితో పొడిచింది.

అయితే కుమార్తెలు నైనా, తానియాపై సరోజిని కత్తితో దాడి చేస్తుండగా రీనా ప్రతిఘటించింది. ఆమె కాళ్లు పట్టుకుని తన పిల్లలను వదిలిపెట్టమని వేడుకున్నది. కుమార్తెలను పారిపోమని చెప్పింది. దీంతో ఒక కుమార్తె బాత్‌రూమ్‌లో దాక్కోగా, మరో కుమార్తె తప్పించుకుని బయటకు పరుగెత్తింది. పొరుగువారిని అప్రమత్తం చేసింది.

మరోవైపు పొరుగువారు ఆ ఇంటికి చేరుకున్నారు. రక్తపు మరకలున్న కత్తితో తలుపు దగ్గర ఉన్న సరోజినిని చుట్టుముట్టి పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చి ఆమెను అప్పగించారు. రీనా, ఆమె పిల్లలను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమెతో పాటు కుమారుడు అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఇద్దరు కుమార్తెలు చికిత్స పొందుతున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నది.

కాగా, కానిస్టేబుల్‌ లలితేష్‌, సరోజిని మధ్య ఉన్న సంబంధం కారణంగా ఈ హత్యలు జరిగినట్లు పోలీస్‌ అధికారి తెలిపారు. శుక్రవారం కూడా ఆమె అతడి ఇంటికి రాగా నచ్చజెప్పి పంపించినట్లు తెలిసిందన్నారు. శనివారం లలితేష్ ఇంట్లో లేని సమయంలో వచ్చిన సరోజిని అక్కడ రక్తపాతం సృష్టించిందని చెప్పారు. నిందితురాలిని అరెస్ట్‌ చేసి ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >
Image 1

గ్రామీణ విద్యార్థిని సత్తా... భద్రాద్రి జిల్లా బిడ్డకు IIM సీటు

Posted On 2026-08-11 14:15:16

Readmore >
Image 1

జూలూరుపాడులో కొత్త సర్పంచుల సంఘం... అధ్యక్షుడిగా భూక్య ప్రసాద్

Posted On 2026-08-11 14:09:26

Readmore >
Image 1

బిజెపి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ

Posted On 2026-08-11 14:02:10

Readmore >
Image 1

హామీలు మరిచి పాలన సాగిస్తే ప్రజలు సహకరించరు

Posted On 2026-08-11 13:59:26

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-08-11 13:57:25

Readmore >
Image 1

రాజమండ్రిలో దారుణం... యువతి హత్య, నిందితుడి ఆత్మహత్యాయత్నం

Posted On 2026-08-11 10:34:29

Readmore >
Image 1

సామాన్యుడికి భారీ ఊరట... యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితమే...

Posted On 2026-08-11 07:54:33

Readmore >
Image 1

వాఙ్మయ ప్రతిభతో చిటికెన రచనలు : ఆచార్య మసన చెన్నప్ప ప్రశంస

Posted On 2026-08-11 07:23:15

Readmore >