| Daily భారత్
Logo




వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!

News

Posted on 2026-04-26 04:26:12

Share: Share


వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!

మొక్కలంటే ఎమ్మెల్యేకు అంత చిన్నచూపా? "పిచ్చి మొక్కలు" అంటూ అనుచిత వ్యాఖ్యలు!

గంధం, టేకు ఉంటేనే వనమా? పర్యావరణంపై ఎమ్మెల్యే వింత వాదన!

ప్రభుత్వ హరిత సంకల్పానికి అధికార పార్టీ ఎమ్మెల్యేనే తూట్లు పొడుస్తున్నారా?

లేఅవుట్ ఓపెన్ స్పేస్ (10%) లో మల్టీపర్పస్ బిల్డింగ్ కట్టడం చట్టవిరుద్ధం కాదా?

అధికారులకు తెలియకుండా అరాచకం జరిగితే.. ఎమ్మెల్యే మద్దతు ఎవరికి?

ప్రభుత్వ ఆస్తి ధ్వంసంపై చర్యలు కోరాల్సింది పోయి.. నిందితులకు ఎమ్మెల్యే వత్తాసు?

10% ఓపెన్ స్పేస్‌లో భవన నిర్మాణాలా? చట్టం ఏం చెబుతోంది?

డైలీ భారత్, షాద్‌నగర్ (నందిగామ):అభివృద్ధి అంటే కాంక్రీట్ భవనాలేనా? పచ్చని చెట్లు అభివృద్ధిలో భాగం కావా? అంటే అవుననే అంటున్నారు షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం వీర్లపల్లి గ్రామంలో ఏడేళ్లుగా పెంచుకున్న "పల్లె ప్రకృతి వనం" పై జెసిబీలతో జరిగిన దాడిని ఆయన సమర్థించిన తీరు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

పర్యావరణాన్ని హేళన చేసిన ఎమ్మెల్యే!

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనంలో 3,000 మొక్కలను నేలమట్టం చేస్తే, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరాల్సిన ఎమ్మెల్యే, "అవన్నీ పిచ్చి మొక్కలే కదా.. దాని వల్ల లాభం ఏముంది?" అంటూ ప్రశ్నించడం గమనార్హం. గంధం చెక్కలు, టేకు చెట్లు ఉంటేనే అది వనం అవుతుందా? ఒక మొక్క ఇచ్చే ఆక్సిజన్‌కు, పర్యావరణ సమతుల్యతకు ఎమ్మెల్యే కట్టే విలువ ఇదేనా అని ప్రకృతి ప్రేమికులు మండిపడుతున్నారు.

అక్కడ భవన నిర్మాణం చేపట్టవచ్చా చట్టం ఏమి చెబుతుంది ? (10% ల్యాండ్ రూల్స్)

వీర్లపల్లిలోని సదరు స్థలం "స్ఫూర్తి వెంచర్" యాజమాన్యం గ్రామ పంచాయతీకి కేటాయించిన 10% ఓపెన్ స్పేస్ (Open Space).

జీఓ నెం. 168 (TBR 2012) మరియు సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం, లేఅవుట్‌లో కేటాయించిన 10% స్థలాన్ని కేవలం పార్క్, ఆటస్థలం లేదా పచ్చదనం కోసం మాత్రమే ఉపయోగించాలి.

ఈ స్థలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మల్టీపర్పస్ కమ్యూనిటీ హాళ్లు, సిమెంట్ కట్టడాలు, వాణిజ్య భవనాలు నిర్మించకూడదు.

అక్కడ మల్టీపర్పస్ బిల్డింగ్ కడతామని ఎమ్మెల్యే చెప్పడం ముమ్మాటికీ లేఅవుట్ నిబంధనల ఉల్లంఘనే.

అధికారుల మౌనం వెనుక మర్మమేంటి?

గ్రామ సర్పంచ్, కార్యదర్శి లేదా ఎంపీడీఓలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, కనీసం నోటీసులు కూడా జారీ చేయకుండా 3,000 మొక్కలను తొలగించడం "ప్రభుత్వ ఆస్తి ధ్వంసం" కిందకు వస్తుంది. చట్టప్రకారం ఇది క్రిమినల్ నేరం. నిందితులపై కేసులు నమోదు చేయాల్సింది పోయి, ఎమ్మెల్యే శంకర్ "అభివృద్ధి కోసం చదును చేయాలి కదా" అని వారికి అండగా నిలవడం వెనుక ఏదైనా భూ కబ్జా కోణం ఉందా అని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వాలు పచ్చదనం కోసం పోరాడుతుంటే,  స్థానికంగా ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు

ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం "హైడ్రా" వంటి సంస్థల ద్వారా పర్యావరణాన్ని రక్షించాలని చూస్తుంటే, క్షేత్రస్థాయిలో అధికార పార్టీ ఎమ్మెల్యేనే పచ్చదనాన్ని ఖూనీ చేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. వీర్లపల్లి ఘటనపై జిల్లా కలెక్టర్ మరియు అటవీ శాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, ధ్వంసమైన వనాన్ని పునరుద్ధరించాలని, నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Image 1

రాజమండ్రిలో దారుణం... యువతి హత్య, నిందితుడి ఆత్మహత్యాయత్నం

Posted On 2026-08-11 10:34:29

Readmore >
Image 1

సామాన్యుడికి భారీ ఊరట... యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితమే...

Posted On 2026-08-11 07:54:33

Readmore >
Image 1

వాఙ్మయ ప్రతిభతో చిటికెన రచనలు : ఆచార్య మసన చెన్నప్ప ప్రశంస

Posted On 2026-08-11 07:23:15

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా బోనాల ఉత్సవాలు

Posted On 2026-08-11 03:21:45

Readmore >
Image 1

గుప్త నిధుల పేరుతో మోసాలు... నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్

Posted On 2026-08-10 18:28:25

Readmore >
Image 1

తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం

Posted On 2026-08-10 18:11:45

Readmore >
Image 1

సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం

Posted On 2026-08-10 17:34:03

Readmore >
Image 1

వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు

Posted On 2026-08-10 15:38:38

Readmore >
Image 1

ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..

Posted On 2026-08-10 14:43:33

Readmore >
Image 1

కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్

Posted On 2026-08-10 14:24:49

Readmore >