| Daily భారత్
Logo




“ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి – నివారణే ఉత్తమ వైద్యం”

News

Posted on 2026-04-26 08:19:35

Share: Share


“ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి – నివారణే ఉత్తమ వైద్యం”

హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా రాజీవ్ నగర్ లో హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో, శివాని హాస్పిటల్స్, సిరిసిల్ల వారి సౌజన్యంతో ఈరోజు ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది. 

ఈ వైద్య శిబిరంలో డాక్టర్ కార్తికేయన్ యం.డి. పల్మనాలజిస్ట్, డాక్టర్ శివరామకృష్ణ డెంటల్ వైద్య నిపుణులు, కె.పున్నంచందర్, సైకాలజిస్ట్ వైద్య సేవలు అందించారు.

ఈ శిబిరంలో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకొని, ఉచిత వైద్య సేవలను వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగా ఛాతి, ఊపిరితిత్తుల వ్యాధుల నిపుణులు డాక్టర్ కార్తికేయన్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, కాలుష్యం, పొగతాగడం, అనారోగ్యకర అలవాట్ల వలన శ్వాసకోశ సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, దగ్గు, అలసట వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా తీవ్రమైన వ్యాధులను ముందుగానే గుర్తించి నివారించవచ్చని తెలిపారు.

దంత వైద్య నిపుణులు డాక్టర్ శివరామకృష్ణ మాట్లాడుతూ దంత ఆరోగ్యం కూడా శరీర ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, పిల్లలలోనూ పెద్దలలోనూ దంత సంరక్షణపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.

ప్రముఖ సైకాలజిస్ట్ కె . పున్నంచందర్ మాట్లాడుతూ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా సమానంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత సమాజంలో ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి, కుటుంబ సమస్యలు, వ్యసనాల కారణంగా మానసిక సమస్యలు పెరుగుతున్నాయని, అలాంటి పరిస్థితుల్లో కౌన్సెలింగ్ మరియు మానసిక ఆరోగ్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి శారీరక, మానసిక ఆరోగ్యాలు రెండూ అవసరమని పేర్కొన్నారు.

శిబిరంలో ప్రజలకు రక్తపోటు, షుగర్, శ్వాసకోశ సమస్యలు, దంత సమస్యలకు సంబంధించి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వైద్య నిపుణులు ప్రజలకు ఆరోగ్య సలహాలు అందించి, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, చెడు అలవాట్లకు దూరంగా ఉండడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా హెల్పింగ్ హార్ట్స్ అధ్యక్షుడు అలువల ఈశ్వర్ మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండేలా ఇలాంటి ఉచిత ఆరోగ్య శిబిరాలు నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు.

వార్డు కౌన్సిలర్ మామిడాల మహేశ్ మాట్లాడుతూ ప్రజలు ఇలాంటి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్య పరిరక్షణపై మరింత శ్రద్ధ చూపాలని కోరారు.

కార్యక్రమంలో హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు అలువల ఈశ్వర్, సైకాలజిస్ట్ పున్నంచందర్, వార్డు కౌన్సిలర్ మామిడాల మహేశ్, ఏలగొండ ఆంజనేయులు, అంతడ్పుల రాము, శ్రీనివాస్, గద్దె ప్రకాశ్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు శిబిరాన్ని అభినందిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు తరచుగా నిర్వహించాలని కోరారు.


Image 1

రాజమండ్రిలో దారుణం... యువతి హత్య, నిందితుడి ఆత్మహత్యాయత్నం

Posted On 2026-08-11 10:34:29

Readmore >
Image 1

సామాన్యుడికి భారీ ఊరట... యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితమే...

Posted On 2026-08-11 07:54:33

Readmore >
Image 1

వాఙ్మయ ప్రతిభతో చిటికెన రచనలు : ఆచార్య మసన చెన్నప్ప ప్రశంస

Posted On 2026-08-11 07:23:15

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా బోనాల ఉత్సవాలు

Posted On 2026-08-11 03:21:45

Readmore >
Image 1

గుప్త నిధుల పేరుతో మోసాలు... నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్

Posted On 2026-08-10 18:28:25

Readmore >
Image 1

తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం

Posted On 2026-08-10 18:11:45

Readmore >
Image 1

సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం

Posted On 2026-08-10 17:34:03

Readmore >
Image 1

వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు

Posted On 2026-08-10 15:38:38

Readmore >
Image 1

ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..

Posted On 2026-08-10 14:43:33

Readmore >
Image 1

కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్

Posted On 2026-08-10 14:24:49

Readmore >