| Daily భారత్
Logo




ఎస్సై చైతన్య చందర్ పై వేటు

News

Posted on 2026-04-26 09:06:35

Share: Share


ఎస్సై చైతన్య చందర్ పై వేటు

డైలీ భారత్, కరీంనగర్ జిల్లా: అన్నా అని పిలిచినందుకు ఓ సెలూన్ షాపు నిర్వాహకుడు పై విధి నిర్వహణలో ఉన్న ఎస్సై దాడి చేశాడు.కరీంనగర్ జిల్లా కేంద్రంలోని దుర్గమ్మ గడ్డ, ఖాన్‌పురా, ప్రాంతం లో ఉన్న ఒక హెయిర్ కట్టింగ్ సెలూన్ ‌లో పోలీసు అధికారి ప్రవర్తనకు సంబంధించిన ఘటనపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు సదరు అధికారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.శనివారం ఉదయం సుమారు 07:30 గంటల సమయంలో కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ ఎన్. చైతన్య చందర్, న్యూ ప్రజా హెయిర్ స్టైల్ సెలూన్‌కు వెళ్లారు. 

ఆ సమయంలో షాప్ శుభ్ర పరిచే పనుల్లో నిమగ్నమై ఉన్న కార్మికుడు పగడాల రాము (50) ఎస్‌ఐను చూసి మర్యాదపూర్వ కంగా అన్నా కూర్చో,అని పలకరించాడు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్‌ఐ, బాధితుడిని అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా అతనిపై చేయిచేసుకున్నాడు. 

ఈ దృశ్యాలన్నీ సెలూన్‌ లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయి, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. జరిగిన సమయంలో ఎస్‌ఐ చైతన్య చందర్, ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద బందోబస్త్ విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నట్లు విచారణలో తేలింది. 

సామాన్య పౌరుడి పై దాడి చేయడం, అధికార దుర్వినియోగానికి పాల్ప డటం మరియు విధి నిర్వహణలో అనుచితంగా ప్రవర్తించినట్లు విచారణ నివేదికలో స్పష్టమవ్వడం తో.. కరీంనగర్ సీపీ గౌష్ ఆలం,డి.ఐ.జి. సిఫారసు మేరకు ఉన్నతాధికారులు సదరు ఎస్‌ఐను సస్పెండ్ చేశారు. 

పోలీస్ శాఖ క్రమశిక్షణకు మారుపేరు. సామాన్య ప్రజలతో అసభ్యంగా ప్రవర్తించినా, చట్టాన్ని అతిక్రమించి అధికారాన్ని దుర్వినియోగం చేసినా ఎంతటి వారినైనా సహిం చేది లేదు. క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవు అని కరీంనగర్ సీపీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Image 1

రాజమండ్రిలో దారుణం... యువతి హత్య, నిందితుడి ఆత్మహత్యాయత్నం

Posted On 2026-08-11 10:34:29

Readmore >
Image 1

సామాన్యుడికి భారీ ఊరట... యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితమే...

Posted On 2026-08-11 07:54:33

Readmore >
Image 1

వాఙ్మయ ప్రతిభతో చిటికెన రచనలు : ఆచార్య మసన చెన్నప్ప ప్రశంస

Posted On 2026-08-11 07:23:15

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా బోనాల ఉత్సవాలు

Posted On 2026-08-11 03:21:45

Readmore >
Image 1

గుప్త నిధుల పేరుతో మోసాలు... నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్

Posted On 2026-08-10 18:28:25

Readmore >
Image 1

తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం

Posted On 2026-08-10 18:11:45

Readmore >
Image 1

సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం

Posted On 2026-08-10 17:34:03

Readmore >
Image 1

వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు

Posted On 2026-08-10 15:38:38

Readmore >
Image 1

ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..

Posted On 2026-08-10 14:43:33

Readmore >
Image 1

కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్

Posted On 2026-08-10 14:24:49

Readmore >