Posted on 2026-04-27 10:39:19
బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో మండల అధ్యక్షులు రెడ్డెం వీర మోహన్ రెడ్డి
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ ఉద్యమ నేతగా, తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాష్ట్ర ప్రజలకు పదేళ్లు సుపరిపాలన అందించారని బీఆర్ఎస్ పార్టీ తల్లాడ మండల అధ్యక్షులు రెడ్డెం వీర మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా తల్లాడ లో పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షులు గరిడేపల్లి వెంకటేశ్వరరావు(జి వి ఆర్) అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అందించారని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదని, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ముఖ్యంగా రైతులకు వరి, మొక్కజొన్న కొనుగోలు లేకపోవడంతో వారు పడుతున్న అవస్థలు అంతా ఇంతా కాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తల్లాడ సర్పంచ్ పెరిక నాగేశ్వరరావు చిన్నబ్బాయి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు దగ్గుల రాజశేఖర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు, షేక్ కమల్, ఏలూరు రఘు, సంఘసాని శ్రీనివాసరావు, డేగల సురేష్, పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >