Posted on 2026-04-27 10:40:31
డైలీ భారత్, అశ్వాపురం: మండలంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. అశ్వాపురం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్ మండలంలోని పలు గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమ నాయకుడు, తెలంగాణ సాధన రథసారథి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో పాటు, గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సబ్బండవర్గాల అభివృద్ధి కోసం కేసీఆర్ కృషి చేశారని అన్నారు. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి రానుందని తెలిపారు. అనంతరం మిఠాయిలు, పండ్లు పంచి సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >