| Daily భారత్
Logo




తినగ తినగ మునగ మేలు చేయు

Health

Posted on 2026-04-27 10:48:29

Share: Share


తినగ తినగ మునగ మేలు చేయు

భారీగా దిగుమతి చేసుకుంటున్న అమెరికన్లు..

తమిళనాడులో లక్ష ఎకరాల్లో చెట్లు

డైలీ భారత్, ఇంటర్నెట్ డెస్క్: బచ్చలి కూర కంటే 24 రెట్లు ఎక్కువ ఐరన్‌ ఇచ్చే ఆకు.. పాల కంటే 16 రెట్లు ఎక్కువ కాల్షియం ఇచ్చే ఆకు.. క్యారట్‌ కంటే 9 రెట్లు ఎక్కువ విటమిన్‌సి ఇచ్చే ఆకు.. అరటి పండులో కంటే ఎన్నో రెట్లు ఎక్కువ పొటాషియం కలిగి ఉండే ఆకు.. ఏంటో తెలుసా?

..పై ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒక్కటే. 

అదే.. మునగాకు. ఆకు ఒక్కటే కాదు.. మునగ చెట్టు బెరడు నుంచి మునగ కాడలు, వాటిలోని గింజల దాకా అన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. మునగ గురించి రెండు ముక్కల్లో చెప్పాలంటే.. అదో ఔషధాల నిధి. పోషకవిలువల గని.

• తమిళ మురుంగై.. ఇంగ్లిష్‌ మోరింగా

మునగను ఇంగ్లిషులో మోరింగా అని అంటారు. 

ఇది మురుంగై అనే తమిళ పదం నుంచి వచ్చింది. తమిళనాట దీనిని విస్తారంగా సేద్యం చేస్తున్నారు. ఒక అంచనా ప్రకారం తమిళనాట దాదాపు లక్ష పైచిలుకు ఎకరాల్లో మునగ సాగవుతోంది. అక్కడి నుంచి మునగాకు, పొడి, విత్తనాలను అమెరికా ఎక్కువగా కొంటోంది. విదేశాలు వీటిని కాస్మెటిక్స్‌లోనూ, ఔషధాల తయారీలోనూ వాడుతున్నారని చెబుతున్నారు తమిళనాడు కు చెందిన మునగ ఎగుమతి కంపెనీ ఎస్‌వీఎం ఎక్స్‌పోర్ట్స్‌ యజమాని ఎస్‌ ముత్తురాజ్‌. తమిళనాడులోనే కాదు.. ఏపీ, కర్ణాటక, ఒడిసాతో పాటు హిమాలయా పర్వత పాదాల వద్ద ఈ చెట్లు పెరుగుతాయి. ఘనా, మొజాంబిక్‌, నైజీరియా, కెన్యా, రువాండా, నైగర్‌, కంబోడియా, హైతీ, ఫిలిప్పీన్స్‌లోనూ మునగ పెరుగుతున్నది.

మునగ.. పాశ్చాత్యలకు ఇది మేజికల్‌ ట్రీ. మన దగ్గర.. "అమ్మకు ప్రియనేస్తం" ఎన్నో పోషక పదార్థాలు ఉండే మునగను ఏడాదికొక్కసారైనా.. కనీసం ఆషాఢంలో నైనా తినాలన్నారు పెద్దలు! ఒక్క ఆషాఢం అనే ఏంటి.. తరచూ తినాల్సిన ఆకు అని ఆధునిక వైద్యనిపుణులు అంటున్నారు. అల్లోపతి, ఆయుర్వేదాలు రెండింటిలోనూ మునగకు విశిష్ట స్థానం ఉంది. ఇది యాంటీబయోటిక్‌గా పనిచేస్తుంది. బాక్టీరియాపై ప్రభావశీలమైన యుద్ధం చేస్తుంది కాబట్టి ఎన్నో వ్యాధులకు శారీరక సమస్యలకు ఓ అత్యుత్తమ పరిష్కారంగా డాక్టర్లు చెబుతున్నారు.

మునగ విత్తనాల్లో యాంటీఆక్సిడెంట్స్‌ ఉంటాయి.. 

ఇవి వాపుల్ని, ఒత్తిడిని నయం చేస్తాయి. కణాలు దెబ్బతినకుండా అడ్డుకుంటాయి. కాలేయాన్ని, మూత్రపిండాల్ని, పేగుల్ని శుభ్రం చేసే గుణం ఉంది. కణాల డ్యామేజి జరక్కుండా చూస్తాయి.. 

యాంటాసిడ్‌గా మునగాకు గ్యాస్ట్రిక్‌ అల్సర్లను నయం చేస్తుంది. ఊబకాయం, మధుమేహానికి మంచి మందు. కేన్సర్‌ చికిత్సలోనూ దీని పాత్రను ఇపుడిపుడే అంచనా వేస్తున్నారు. కండరాల నొప్పి, క్షీణతకు తగిన మందు. శరీర ఉష్ణోగ్రతను తగ్గించడం వల్ల నిద్ర సరిగా పట్టేట్టు చేస్తుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. కిడ్నీల్లో రాళ్లు తొలగించడానికి, లివర్‌ సిరోసి్‌సకు ఇది అద్భుతమైన మందు అని ఆయుర్వేద డాక్టర్లు చెబుతున్నారు. 200 మిల్లీ గ్రాముల మునగాకు పొడి తింటే రక్తంలో షుగర్‌ లెవల్స్‌ దాదాపు 40ు తగ్గుతాయి. లైంగిక సామర్థ్యం పెరగడానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది, తినడానికి ఘాటుగా ఉన్నా ఇది పరమౌషధం.

 రూ.80 కిలో మునగాకు ఎగుమతి ధర

రూ.500 కిలో మునగవిత్తనాల ఎగుమతి ధర.

మన మునగాకుకే డిమాండ్‌

మునగ భారత్‌లోనూ, అనేక ఆఫ్రికన్‌ దేశాల్లోనూ ఎదుగుతుంది. పశ్చిమదేశాల్లో కానరాదు. వీటిలోనూ భారత్‌ నుంచి వచ్చే మునగాకు శ్రేష్ఠమైనది. అందుకే- భారత్‌ నుంచి మునగ ఆకును అమెరికా, కెనడా, ఐరోపా దేశాలు, చైనా, జర్మనీ, దక్షిణ కొరియాల్లో దీనికోసం ఎగబడుతున్నాయి. అక్కడ మునగాకు పొడికి చాలా డిమాండ్‌ ఉంది. 2015లో భారత్‌ నుంచి రూ 146 కోట్ల విలువైన మునగ ఆకులు ఆయా దేశాలకు ఎగుమతి అయ్యాయి. ఒక అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మునగాకు వ్యాపారం దాదాపు 27వేల కోట్లు.. ఇంకో రెండేళ్ళలో ఇది రూ 47,500 కోట్లకు పెరగవచ్చు.

• ఇవీ పోషకాలు..

వంద గ్రాముల మునగాకులో

ఏమేం పోషకాలుంటాయంటే..

మాంసకృత్తులు: 8.3 గ్రాములు

కాల్షియం: 434 మిల్లీగ్రాములు

పొటాషియం: 202 మిల్లీగ్రాములు

విటమిన్‌ ఎ: 738 మిల్లీగ్రాములు

విటమిన్‌ సి: 164 మిల్లీ గ్రాములు

పీచుపదార్థాలు: 19.2 గ్రాములు.

Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >
Image 1

విద్యావంతుడు ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో విద్య శూన్యం..?

Posted On 2026-08-08 16:04:38

Readmore >
Image 1

రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్

Posted On 2026-08-08 14:28:17

Readmore >
Image 1

రాజమండ్రిలో మెడికోపై తాగుబోతుల రాక్షసత్వం...

Posted On 2026-08-08 07:38:13

Readmore >
Image 1

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!

Posted On 2026-08-08 04:36:39

Readmore >
Image 1

వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

Posted On 2026-08-07 16:00:29

Readmore >