Posted on 2026-05-04 21:45:49
హమాలీలు, లారీల సంఖ్యను పెంచాలి.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్.
యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లు, రవాణా తదితర అంశాలపై వివిధ శాఖల అధికారులు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో సమీక్ష.
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే లారీల నుంచి ధాన్యాన్ని వెంట వెంటనే అన్ లోడింగ్ చేయాలని రైస్ మిల్లర్లను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు, రవాణా తదితరు అంశాలపై జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు, రైస్ మిల్లర్లు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు, వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారు? ఎంత తరలించారు? ఆన్లైన్ ఎంట్రీ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. రైస్ మిల్లర్లు హమాలీల సంఖ్య వెంటనే పెంచాలని, కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని వేగంగా అన్ లోడింగ్ చేయించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఆన్లైన్ ఎంట్రీని పూర్తి చేయాలని సూచించారు. పౌరసరఫరాల శాఖ అధికారులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరించిన రైతుల ఖాతాల్లో డబ్బులు వేగంగా జమ అయ్యేలా చూడాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని, వెంట వెంటనే కొనుగోలు చేయాలని సూచించారు. అకాల వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున ధాన్యం తడవకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. లారీల ట్రాన్స్పోర్ట్ లు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యానికి అనుగుణంగా వాహనాలను సమకూర్చాలని దాన్యం తరలింపులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ గీత, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఎల్ బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, రైస్ మిల్లర్లు. లారీల ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >