Posted on 2026-05-07 22:08:07
టెన్త్,ఇంటర్మీడియట్ పరీక్షలలో మంచి మార్కులు సాధించిన జిల్లా పోలీసు అధికారులు,సిబ్బంది పిల్లలను అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనపరిచి మంచి మార్కులు సాధించిన జిల్లా పోలీసు అధికారులు,సిబ్బంది పిల్లలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు జరిగిన కార్యక్రమంలో ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు గల కాన్ఫరెన్స్ హాల్ నందు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మొత్తం 63 మంది పోలీస్ సిబ్బంది పిల్లలు,వారి తల్లీదండ్రులు హాజరయ్యారు.ముందుగా మంచి మార్కులు సాధించిన విద్యార్థిని,విద్యార్థులు కొంతమంది తమ తల్లీదండ్రుల కష్టాన్ని,భవిష్యత్తులో తాము సాధించాలనుకుంటున్న లక్ష్యాలను వివరిస్తూ ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకుగాను ఎస్పీ కి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో అహర్నిశలు కష్టపడుతూ ప్రజలకు సేవలు అందిస్తూ తమ పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతున్న తల్లిదండ్రులు కష్టాన్ని గుర్తించాలని పిల్లలకు సూచించారు. పట్టుదల,క్రమశిక్షణ,ఆత్మ స్థైర్యం ఉంటే ఎలాంటి కష్టమైన లక్ష్యాన్నైనా సులభంగా సాధించవచ్చని అన్నారు.జీవితంలో ఎల్లప్పుడూ పాఠాలను నేర్చుకుంటూనే ఉండాలని, ప్రతి రోజు ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలని తెలిపారు.మంచి స్నేహితులను ఏర్పాటు చేసుకొని,దురలవాట్లకు దూరంగా ఉంటూ ప్రతి ఒక్కరూ ఉన్నత లక్ష్యాలకు చేరుకొని తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.పోలీస్ కుటుంబంలో పుట్టి పెరిగిన ఎస్పీ బాల్యం నుండి ఐపిఎస్ సాధించే వరకు తన గత స్మృతులను వారితో పంచుకున్నారు. అనంతరం మంచి మార్కులు సాధించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోలీసులు కుటుంబంలోని విద్యార్థినీ,విద్యార్థులకు ఎస్పీ ప్రశంసా పత్రాలతో పాటు మెమొంటోలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ, చుంచుపల్లి సిఐ వెంకటేశ్వర్లు, వన్ టౌన్ సీఐ కరుణాకర్,త్రీటౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి,ఎంటిఓ సుధాకర్, హోంగార్డ్స్ ఇంచార్జ్ ఆర్ఐ నరసింహారావు,వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు,అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు,ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >