Posted on 2026-05-08 08:07:43
డైలీ భారత్, ఏలూరు: భర్త సంపాదించిన డబ్బులను, ఆ భర్త ప్రాణాలు తీసేందుకు సుపారి కింద చెల్లించిన మహా ఇల్లాలు.. ఉంచుకున్న వాడికోసం కట్టుకున్నోడిని దారుణంగా చంపించిన ఘోరం. ఏలూరులో జరిగిన ఈ దారుణంలో ప్రియుడికి 12 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన మహా ఇల్లాలు దుర్గామణి. గత నెల 17న హత్యకు గురైన వడ్లమాను గ్రామానికి చెందిన సులేమాన్ రాజు కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. వడ్లమాను సచివాలయంలో పనిచేస్తున్న వెంకన్నబాబు అనే వ్యక్తితో సులేమాన్ రాజు భార్య దుర్గామణి అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆమె ప్రేమ వ్యవహారం భర్తకు తెలిసి మందలించాడు. మంచి మాట చెవికి ఎక్కని దుర్గామణి ప్రియుడు కోసం భర్తను చంపేయాలని ప్లాన్ వేసింది. ప్రియుడికి 12. లక్షలు ఇచ్చింది. ఎలా చంపాలో స్కెచ్ కూడా వేసింది.
దాని ప్రకారం సెల్‌ఫోన్ ఛార్జింగ్ కేబుల్‌తో సులేమాన్ రాజు గొంతుకు బిగించి ఊపిరి ఆడకుండా చేసి మృతదేహాన్ని ఉప్పులూరు రైవస్ కాలువలో పడేశారు.
హత్యపై పోలీసులు విచారణ జరపగా, ప్రియుడి కోసం భార్యే సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుల వద్ద నుంచి కారు, సెల్‌ఫోన్లు, నగదు, ఛార్జింగ్ కేబుల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >