Posted on 2026-05-08 16:44:09
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి చండ్ర నరేంద్ర కుమార్
షరతులు లేకుండా ధాన్యం, మొక్కజొన్నలు తక్షణమే కొనుగోలు
చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సొసైటీ కొనుగోళ్లు వద్ద ధర్నా
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంల కేంద్రాలలో అకాల వర్షాలకు తడుస్తున్నటువంటి వరి ధాన్యం మొక్కజొన్నలు తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సొసైటీ కొనుగోలు కేంద్రం ఎదుట జరిగిన ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యంతో కొనుగోలు కేంద్రాలలో వేలాది బస్తాలు ధాన్యం, మొక్కజొన్నలు ములుగుతోందని అన్నారు. నిబంధనల మేరకు కొనుగోలు కేంద్రాన్ని తీసుకొచ్చిన పంటను తేమ శాతం ఎక్కువగా ఉందని, తాలు ఎక్కువగా, రంగు మారింది అంటూ అధికారులు పలు విధాలుగా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు.. పంట వివరాలను నమోదు చేయడానికి యాప్ మూసివేశారని, దీనిపై అవగాహన లేక పంట వివరాలు నమోదు చేయలేదని తెలిపారు. అధికారులు రైతు యాప్ ను నిరంతరం పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు... ధాన్యం కొనుగోలు కేంద్రాలలో సక్రమంగా ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారని అన్నారు. దీనిని అవకాశం గా తీసుకున్న పలువురు ప్రైవేట్ వ్యాపారులు అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను నిలువునా ముంచుతున్నారని మండిపడ్డారు. ఒకవైపు అకాల వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు, మరోవైపు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో వర్షానికి పంట నష్టం జరుగుతుందని అన్నదాతలు ఆగమాగం అవుతున్నారని, కొనుగోలు కేంద్రాల వద్ద రాత్రి పగలు లేకుండా వర్షం పడుతుందేమో అని కాపు కాయాల్సి వస్తుంది దీనివల్ల రైతులు కూడా ప్రమాదాలు బారిన పడే అవకాశం ఉంది అని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంక్షేమమే ధ్యేయమంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడంలో ఘోరంగా విఫలం చెందుతుందని విమర్శించారు.. ఇకనైనా షరతులు లేకుండా రైతులు పండించిన మొత్తం పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల యావత్ రైతాంగాన్ని సమీకరించి ఆందోళన కు దిగుతామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి యాస రోశయ్య, ఎల్లంకి మధు తూము కోటయ్య సిరిపురపు వెంకటేశ్వర్లు గార్లపాటి వీరభద్రం ఎల్లంకి శీను వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >