| Daily భారత్
Logo




లేడీ డీఎస్పీ నిర్వాకం.. అసలు గుట్టు విప్పిన రూరల్ పోలీసులు

News

Posted on 2026-05-09 06:27:23

Share: Share


లేడీ డీఎస్పీ నిర్వాకం.. అసలు గుట్టు విప్పిన రూరల్ పోలీసులు

డైలీ భారత్, ఆంధ్రా ప్రదేశ్ డెస్క్: ఆంధ్రా ప్రదేశ్ రాష్ట్రం అనంతపురంలో ఓ మహిళ తాను డీఎస్పీ, కానిస్టేబుల్ అంటూ 40 లక్షల వరకు దోచుకొని మోసం చేసిన సంఘటన వెలుగు చూసింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ముద్దినాయన పల్లి గ్రామానికి చెందిన సరస్వతి, అనంత గ్రామీణ ఆలమూరుకి చెందిన రంగనాయకులు పరిచయస్తులు. రంగనాయకులకు వరుసకు తమ్ముడు అయిన రామానాయుడును సరస్వతి డిఎస్పి అంటూ పరిచయం చేశాడు. తాను డీఎస్పీ నని తన పిల్లలకు ఆరోగ్యం సరిగా లేదని చికిత్స చేయించాలంటూ పలుమార్లు రామానాయుడుతో రంగనాయకుల ద్వారా 40 లక్షల వరకు డబ్బులు అప్పుగా తీసుకుంది.దీనికి సంబంధించి ప్రాంసరీ నోట్లను రామానాయుడుకు రాసి ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే కొంతకాలంగా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తూ తాను డీఎస్పీ నంటూ నిత్యం బెదిరింపులకు పాల్పడుతోందని బాధితుడు రామానాయుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో అనంతపురం రూరల్ పోలీసులు రామానాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

సరస్వతి, రంగనాయకులు, రామానాయుడు వీరంతా కుటుంబ సభ్యులేనని పోలీసులు తెలిపారు. సరస్వతి తాను పోలీసును అంటూ మోసం చేసి డబ్బులు వసూలు చేసినట్టు తెలిసిందని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ సీఐ పుల్లయ్య తెలిపారు.

Image 1

ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS

Posted On 2026-06-19 21:55:09

Readmore >
Image 1

నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం

Posted On 2026-06-19 20:54:23

Readmore >
Image 1

గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-06-19 20:36:40

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్‌ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌

Posted On 2026-06-19 20:33:12

Readmore >
Image 1

రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం

Posted On 2026-06-19 19:17:58

Readmore >
Image 1

భూవివాదాలు లేని తెలంగాణ నిర్మాణ‌మే లక్ష్యం

Posted On 2026-06-19 19:13:38

Readmore >
Image 1

గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్

Posted On 2026-06-19 19:11:46

Readmore >
Image 1

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఉద్యోగి

Posted On 2026-06-19 19:00:24

Readmore >
Image 1

దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-06-19 17:52:08

Readmore >
Image 1

ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం

Posted On 2026-06-19 16:50:47

Readmore >