Posted on 2026-05-11 15:56:31
ఏడాదిగా ప్రేమ... తర్వాత పెళ్లి... మనస్పర్ధలు
డైలీ భారత్, సిద్దిపేట: ప్రేమ పెళ్లి చేసుకొని ఇద్దరు మనస్పర్థలు రావడంతో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా కుకునూరు పల్లి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం......కొమురవెళ్లి గ్రామానికి చెందిన దేశెట్టి వినయ్(23) అనే యువకుడు గ్రామంలో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొండపాక గ్రామానికి చెందిన దండ్ల అంజలి(21) అనే యువతి దర్జా పని చేస్తూ తల్లిదండ్రులకు చేదోవాదోడుగా ఉంటుంది. గత సంవత్సరం అంజలి, వినయ్ గాఢంగా ప్రేమించుకున్నారు. ఇరువైపుల కుటుంబ సభ్యులను ఒప్పించి నెల రోజుల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వినయ్ పలుమార్లు ఫోన్ చేసినప్పుడు అంజలి ఎంగేజ్ రావడంతో ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఫోన్ ఆలస్యంగా మాట్లాడడంతో ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. దీంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. వినయ్ ఫోన్ చేయడంతో ఆలస్యంగా లిఫ్ట్ చేయడంతో ఆమెపై అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో మనస్థాపం చెందిన అంజలి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. ఈ విషయం ప్రియుడికి తెలియడంతో రాయవరం గ్రామ శివారులో చెట్టుకొని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు తన తండ్రి సహదేవ్‌కు ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పడంతో పాటు లోకేషన్ షేర్ చేశాడు. తల్లిదండ్రులు, స్నేహితులు అక్కడికి వెళ్లే చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >