| Daily భారత్
Logo




రౌడీయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్

News

Posted on 2026-05-11 20:38:54

Share: Share


రౌడీయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్

రౌడీలపై ప్రత్యేక నిఘా – “రౌడీ మేళ” ద్వారా మార్పు దిశగా అడుగు

సత్ప్రవర్తన కనబరిచిన 13 మంది రౌడీషీటర్ల షీట్ల తొలగింపునకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు

10 ఏళ్ల మంచి ప్రవర్తనకు రౌడీషీట్ తొలగింపు అవకాశం – కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం

నేరాలు, బెదిరింపులు, దందాలకు తావులేదు – రౌడీషీటర్ల మార్పే లక్ష్యం

నేరరహిత సమాజ నిర్మాణమే లక్ష్యం – జిల్లా పోలీస్ యంత్రాంగం సంకల్పం

రౌడీయిజం వద్దు - ప్రశాంత జీవితం ముద్దు": రౌడీ మేళాలో జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్ దిశా నిర్దేశం.

డైలీ భారత్, కామారెడ్డి: జిల్లాలో రౌడీయిజానికి పూర్తిగా ముగింపు పలుకుతామని, భయపెట్టి దందాలు చేయడం, బెదిరింపులు, గొడవలు సృష్టించడం వంటి అసాంఘిక చర్యలకు ఏమాత్రం సహనం ఉండదని జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ స్పష్టం చేశారు. అదే సమయంలో తమ ప్రవర్తన మార్చుకుని సాధారణ జీవితం గడుపుతున్న వారికి పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని తెలిపారు. సత్ప్రవర్తన కనబరిచిన 13 మంది రౌడీషీటర్ల షీట్ల తొలగింపునకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడం, మార్పు చూపిన ప్రతి ఒక్కరికీ కొత్త జీవితానికి మార్గం కల్పించాలన్న పోలీసుల సంకల్పానికి నిదర్శనమని తెలిపారు.

ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీట్లు కలిగిన వ్యక్తులతో ప్రత్యేకంగా “రౌడీ మేళ” నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు రౌడీషీటర్లతో ప్రత్యక్షంగా మాట్లాడి, చట్టవ్యతిరేక కార్యకలాపాలను పూర్తిగా మానుకుని కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన జీవితం గడపాలని సూచించారు. ప్రజలను బెదిరించడం, డబ్బులు వసూలు చేయడం, గంజాయి విక్రయం, హత్యలు, హత్యాయత్నాలు, గొడవలు వంటి నేరాలకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయడానికీ వెనుకాడబోమన్నారు.

పోలీసు రికార్డులు, స్థానిక పోలీస్ అధికారుల నివేదికలు మరియు జిల్లా స్థాయి రౌడీ షీట్స్ రివ్యూ కమిటీ పరిశీలన ఆధారంగా సత్ప్రవర్తన కనబరిచిన 13 మంది రౌడీషీటర్ల షీట్ల తొలగింపునకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయబడినట్లు ఎస్పీ గారు వెల్లడించారు. వీరంతా భవిష్యత్తులో కూడా ఎలాంటి నేరాలకు పాల్పడకుండా బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించాలని ఆకాంక్షించారు.

వరుసగా 10 సంవత్సరాల పాటు ఎలాంటి నేరాల్లో ప్రమేయం లేకుండా మంచి ప్రవర్తన కనబరిచిన వారికి నిష్పక్షపాత విచారణ అనంతరం జిల్లా అధికారుల కమిటీ సిఫారసు మేరకు రౌడీ షీట్లు తొలగించే అవకాశం ఉంటుందని తెలిపారు. అయితే మార్పు చూపకుండా తిరిగి నేరాలకు పాల్పడుతున్న వారి రౌడీ షీట్లు యథావిధిగా కొనసాగుతాయని, వారి కేసులను స్వయంగా పర్యవేక్షిస్తూ కోర్టుల్లో శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో కత్తులు, ఆయుధాలతో ఫోటోలు పోస్టు చేయడం, ప్రజల్లో భయాందోళనలు కలిగించే విధంగా ప్రవర్తించడం వంటి చర్యలను కూడా తీవ్రంగా పరిగణిస్తామని ఎస్పీ గారు హెచ్చరించారు.

నేరరహిత సమాజ నిర్మాణం కోసం జిల్లా పోలీస్ యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తోందని, రౌడీషీటర్లలో సానుకూల మార్పు తీసుకురావడం ద్వారానే సమాజంలో శాంతి, భద్రతలు మరింత బలోపేతం అవుతాయని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీ కే. నరసింహారెడ్డి, డీఎస్పీలు మధుసూదన్, విఠల్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మధుసూదన్, డీసీఆర్‌బీ సీఐ మురళి, సీఐలు, ఎస్‌ఐలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >