| Daily భారత్
Logo




బస్టాండ్ ఏర్పాటు చేయాలనీ మంత్రి పొన్నంను కలిసిన కాంగ్రెస్ నేతలు

News

Posted on 2026-05-12 16:37:06

Share: Share


బస్టాండ్ ఏర్పాటు చేయాలనీ మంత్రి పొన్నంను కలిసిన కాంగ్రెస్ నేతలు

కామారెడ్డిలో బస్టాండ్ ఏర్పాటుకు సానుకూలంగా స్పందించిన మంత్రి

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో హైవే & ఎక్స్ ప్రెస్ ప్రత్యేక బస్టాండ్ ఏర్పాటు చేయాలని తెలంగాణ పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. మంగళవారం రాష్ట్ర రవాణా & బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కామారెడ్డి కాంగ్రెస్ నేతల బృందం ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నూతన బస్టాండ్ ఏర్పాటు విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్బంగా టిఎస్ఆర్టీసీ ఎండి, కామారెడ్డి జిల్లా కలెక్టర్ బస్టాండ్ ఏర్పాటు సాధ్యసాధ్యాలు, స్థలం కేటాయించాలని మంత్రి ఆదేశించారు. 

కామారెడ్డి జిల్లా కేంద్రం ఉత్తర తెలంగాణలో ప్రముఖ పట్టణంగా విస్తరిస్తుందని పలు విషయాలు మంత్రి పొన్నం దృష్టికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తీసుకొచ్చారు. ప్రస్తుతం కామారెడ్డి పట్టణం లక్ష జనాభాకు పైగా ఉందని, ప్రస్తుతం పట్టణం నలువైపులా విస్తరిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న కొత్త బస్టాండ్ విస్తీర్ణం తక్కువగా ఉండటం వల్ల రాకపోకలకు ఇబ్బందులు తలేత్తుతున్నాయి. మరోవైపు 44వ జాతీయ రహదారి విస్తరణ జరగడంతో ఆర్మూర్, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నాగ్ పూర్, కోరుట్ల, మెట్ పల్లి తదితర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు కామారెడ్డి పట్టణంలోకి రావడం లేదు. నాన్ స్టాఫ్ బస్సుల కారణంగా కామారెడ్డికి రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డి 44వ జాతీయ రహదారి పక్కన ప్రభుత్వ పరంగా, ఆర్టీసీకి అనుకూలంగా భూమి ఉన్నందున అ స్థలంను కేటాయించి నాన్ స్టాఫ్ బస్టాండ్ కానీ హైవే బస్టాండ్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోగలరని కోరుచున్నాము. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కీలకమైన కామారెడ్డి నుంచి రాకపోకలు కొనసాగించేలా హైవే బస్టాండ్ ఏర్పాటు చేయాలనీ కోరుచున్నాము. దీని కారణంగా ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలకు రాకపోకలు సాఫీగా జరిగే అవకాశం ఉంటుందని టీ పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మంత్రికి ఇచ్చిన వినతి పత్రంలో కోరారు. మంత్రిని కలిసిన వారిలో అడ్లూర్ కౌన్సిలర్ గడ్డమిది మహేష్, డీసీసీ ఉపాధ్యక్షులు నిమ్మ విజయ్ కుమార్ రెడ్డి, క్రెడా అధ్యక్షులు గణగోన లక్ష్మి నర్సాగౌడ్, కాంగ్రెస్ నేతలు శ్రీధర్ రావ్ ఉన్నారు.

Image 1

అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS

Posted On 2026-06-16 17:35:59

Readmore >
Image 1

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

Posted On 2026-06-16 13:25:04

Readmore >
Image 1

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

Posted On 2026-06-16 13:07:06

Readmore >
Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >