Posted on 2026-05-13 22:54:47
డైలీ భారత్, కామారెడ్డి: సదాశివనగర్ మండలం ఉత్తనూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సందర్శించి పరిశీలించారు.
అనంతరం మాట్లాడుతూ, రైతుల నుండి మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతులు కేంద్రాల వద్ద ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.
ప్రస్తుత ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కొనుగోలు ప్రక్రియను ఉదయం, సాయంత్రం వేళల్లో నిర్వహించాలని తెలిపారు. కేంద్రంలో తాగునీరు, నీడ, ORS ప్యాకెట్లు మరియు ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.
రైతులు తీసుకొచ్చిన మొక్కజొన్న నాణ్యత ప్రమాణాలను పరిశీలించి, తేమ శాతం నిబంధనల ప్రకారం ఉండేలా చూడాలని తెలిపారు. కొనుగోలు అనంతరం లిఫ్టింగ్ ప్రక్రియను కూడా వేగవంతం చేసి రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అలాగే ట్రాన్స్‌పోర్ట్‌కు సంబంధించి డీఎం మార్క్‌ఫెడ్ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తూ, రవాణా ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే 5 వేల క్వింటాళ్ల మొక్కజొన్నను గోదాములకు తరలించడం జరిగిందని, మిగిలిన స్టాక్‌ను వచ్చే 10 రోజుల్లో పూర్తి స్థాయిలో తరలించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
అనంతరం మొక్కజొన్న తూర్పార పట్టే విధానాన్ని పరిశీలించి, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ప్రక్రియ నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు, తూర్పార పట్టడం మరియు రవాణా ప్రక్రియలు సమన్వయంతో కొనసాగించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమం లో సహకార అధికారి రామ్మోహన్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >