| Daily భారత్
Logo




ప్రకృతిని కాపాడు : మంజుల పత్తిపాటి

News

Posted on 2026-05-14 19:43:09

Share: Share


ప్రకృతిని కాపాడు :  మంజుల పత్తిపాటి

డైలీ భారత్,యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లా, మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల పత్తిపాటి పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ, ప్రకృతిని మనిషి స్వార్థంతో నాశనం చేస్తున్న విధానం భవిష్యత్తులో మరింత భయంకర పరిస్థితులకు దారితీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 

“ఎల్ నినో” వంటి ప్రకృతి మార్పులు కేవలం శాస్త్రవేత్తలు చెప్పే పదాలు మాత్రమే కావని, మనిషి చేసిన తప్పుల ఫలితంగా ప్రకృతి ఇస్తున్న హెచ్చరికలని అన్నారు.

 అడవుల నరికివేత, పెరుగుతున్న కాలుష్యం, పచ్చని పంట పొలాలను వెంచర్లుగా మార్చడం వల్ల ప్రకృతి సమతుల్యత పూర్తిగా దెబ్బతింటోంది.

మనం కోసే ప్రతి చెట్టు రేపటి తరానికి తీసేస్తున్న ఒక ఊపిరి… మనం పూడ్చేస్తున్న ప్రతి చెరువు భవిష్యత్తు దాహానికి కారణం… మనం కాలుష్యంతో నింపుతున్న ప్రతి గాలి మన పిల్లల ఆరోగ్యాన్ని కబళిస్తోంది. ఈరోజు ఎండలు తీవ్రరూపం దాల్చి, పల్లెల్లో వృద్ధులు, చిన్నారులు బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. రైతు వాన కోసం ఎదురుచూస్తే అకాల వర్షాలు పంటలను నేలమట్టం చేస్తున్నాయి. మరోవైపు వరదలు వస్తే పేదవాడి గుడిసె కొట్టుకుపోతోంది. చివరకు బాధపడేది సామాన్యుడే అని అన్నారు. 

ప్రకృతి మన తల్లి… తల్లిని కాపాడాల్సింది పోయి గాయపరుస్తున్నాం. భూమి ఏడుస్తోంది… ఆ ఏడుపే ఈ ఎండలు, ఈ వరదలు, ఈ తుఫాన్లు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి దాన్ని సంరక్షించి, ప్రకృతిని కాపాడే దిశగా ముందుకు రావాలి” అని పిలుపునిచ్చారు.

Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >