Posted on 2026-05-16 10:16:16
డైలీ భారత్, బిహార్: మద్య నిషేధం అమలులో ఉన్న బీహార్‌లో అక్రమ మద్యం రవాణాదారులు కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు.
తాజాగా ధన్బాద్ నుంచి పాట్నా వెళ్తున్న గంగా దామోదర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఏకంగా కంపార్ట్‌మెంట్ పైకప్పులోనే సుమారు 5 వేల బీర్ టిన్స్ దాచిపెట్టి తరలిస్తుండగా బయటపడింది.
అయితే బోగీ పైకప్పులో దాచిన టిన్స్ ప్రయాణ సమయంలో ఒకదానికొకటి ఢీకొనడంతో కొన్ని లీక్ అయ్యాయి. దీంతో బోగీలో వర్షపు చినుకుల్లా బీర్ కారడం మొదలైంది. అనుమానం వచ్చిన ప్రయాణికులు, రైల్వే సిబ్బంది సమాచారం ఇవ్వడంతో ఈ భారీ స్మగ్లింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఇదే రైలులో నెల రోజుల క్రితం కూడా సుమారు 1500 మద్యం క్వార్టర్ బాటిల్స్ పట్టుబడటం గమనార్హం. వరుస ఘటనలతో బీహార్‌లో రైళ్ల ద్వారా జరుగుతున్న అక్రమ మద్యం రవాణాపై అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >
రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్
Posted On 2026-08-08 14:28:17
Readmore >
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >