Posted on 2026-05-16 10:42:12
డైలీ భారత్ ఖమ్మం: ఆన్లైన్ లో ట్రేడింగ్ మరియు ఇన్వెస్ట్మెంట్ లో డబ్బులు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి, సుమారు 18 లక్షల రూపాయలు మోసం చేసిన కేసులలో ఇద్దరిని ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు ఆంధ్ర ప్రదేశ్ రాష్టo లోని వెస్ట్ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం లో అరెస్టు చేసినట్లు ఖమ్మం సి.పి. సునిల్ దత్ తెలిపారు. కేసు వివరాలలోకి వెళితే ఖమ్మం జిల్లాకు చెందిన ప్రైవేట్ ఉద్యోగికి Whatsapp లో పరిచయం అయి ఆన్లైన్ లో ట్రేడింగ్ మరియు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని ఆశచూపి వాట్సప్ మరియు ట్రేడింగ్ లింకుల ద్వారా సుమారు 18 లక్షలు రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోయిన కేసులో గాను మరియు వివిధ కేసులలో నిందితుడు గా ఉన్న అక్కౌంట్ హోల్డర్ అయిన సింగంశెట్టి సురేష్ , వయస్సు 32 సం: లు ను వెస్ట్ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం లో అరెస్టు చేసి ఖమ్మం సైబర్ క్రైం కోర్టులో హజరు పరిచి, రిమాండ్ కి తరలించినట్లు తెలిపారు. ఈ కేసు విచారణలో ముఖ్య పాత్ర వహించిన సైబర్ క్రైమ్ డి. ఎస్పీ, CH.R.V. ఫణిందర్ ని మరియు అట్టి టాస్క్ లో పాల్గొన్న ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ భూక్యా రవి కుమార్ , ఎస్సై లు రoజిత్ కుమార్ , విజయకుమార్ లను,హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస రావు ,కానిస్టేబుల్స్ భాను మూర్తి , కృష్ణ ప్రసాద్ ,నాగేశ్వరావ్ మరియు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఖమ్మం C.P. సునీల్ దత్, IPS అభినందించారు.
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >
రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్
Posted On 2026-08-08 14:28:17
Readmore >
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >