| Daily భారత్
Logo




రాజన్న సిరిసిల్ల జిల్లా : ఈ-ఫార్మసీని నిలిపివేయాలి...

News

Posted on 2026-05-20 09:09:12

Share: Share


రాజన్న సిరిసిల్ల జిల్లా : ఈ-ఫార్మసీని నిలిపివేయాలి...

సిరిసిల్ల, వేములవాడలలో స్వచ్ఛందంగా మూతపడిన మెడికల్ షాపులు...

డైలీ భారత్, సిరిసిల్ల: ఆన్‌లైన్ మందుల విక్రయాల విధానం ఈ-ఫార్మసీ చిన్న తరహా మెడికల్ వ్యాపారుల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తోందని, దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలో మెడికల్ వ్యాపారులు నిరసన గళమెత్తారు. దేశవ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు వేములవాడ పట్టణంలో మెడికల్ షాపుల యజమానులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసి తమ నిరసన తెలిపారు. ఉదయం నుంచే మెడికల్ షాపుల యజమానులు దుకాణాలను తెరవకుండా ఆందోళనలో పాల్గొన్నారు. ఈ-ఫార్మసీ విధానం అమల్లోకి వస్తే స్థానికంగా ఉన్న వేలాది చిన్న మెడికల్ షాపులు మూతపడి, లక్షలాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ సంస్థలు ఇస్తున్న ఆఫర్లతో తాము పోటీ పడలేకపోతున్నామని, దీనివల్ల ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నామని వారు పేర్కొన్నారు. కేవలం వ్యాపార కోణంలోనే కాకుండా, రోగుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ-ఫార్మసీ విధానం ప్రమాదకరమని వ్యాపారులు హెచ్చరిస్తున్నారు. ఆన్‌లైన్ వేదికల ద్వారా నకిలీ మందులు విక్రయించే అవకాశం ఉందని, తద్వారా రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మందుల అమ్మకాల్లో నాణ్యత, నిబంధనల అమలులో ఈ-ఫార్మసీ సంస్థల వల్ల అనేక లోపాలు జరుగుతాయని వారు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, చిన్న వ్యాపారుల ప్రయోజనాలను కాపాడాలని, రోగుల ఆరోగ్య హితం కోరి ఈ-ఫార్మసీ విధానాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని మెడికల్ షాపుల యజమానుల సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు. మెడికల్ షాపులు బంద్ కావడంతో మందుల కోసం వచ్చిన రోగులు ఇబ్బందులు పడ్డారు.

Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా బోనాల ఉత్సవాలు

Posted On 2026-08-11 03:21:45

Readmore >
Image 1

గుప్త నిధుల పేరుతో మోసాలు... నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్

Posted On 2026-08-10 18:28:25

Readmore >
Image 1

తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం

Posted On 2026-08-10 18:11:45

Readmore >
Image 1

సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం

Posted On 2026-08-10 17:34:03

Readmore >
Image 1

వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు

Posted On 2026-08-10 15:38:38

Readmore >
Image 1

ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..

Posted On 2026-08-10 14:43:33

Readmore >
Image 1

కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్

Posted On 2026-08-10 14:24:49

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు

Posted On 2026-08-10 07:42:21

Readmore >
Image 1

నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య

Posted On 2026-08-10 07:40:54

Readmore >
Image 1

మిస్ యూనివర్స్ పోటీల్లో సత్తా చాటిన మాదినేని నిఖిత

Posted On 2026-08-10 07:39:20

Readmore >