Posted on 2026-05-21 08:17:15
10 తులాల బంగారం, కియా కారెన్స్ కారు స్వాధీనం
జడ్చర్ల పోలీసుల చాకచక్యానికి జిల్లా ఎస్పీ డి.జానకి ప్రశంసలు
డైలీ భారత్, మహబూబ్‌నగర్: జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా జరుగుతున్న బస్సు దొంగతనాల కేసులను ఛేదిస్తూ, హర్యానా రాష్ట్రానికి చెందిన అంతర్రాష్ట్ర ప్రొఫెషనల్ జేబుదొంగల/బ్యాగు దొంగల ముఠాను జడ్చర్ల పోలీసులు అరెస్ట్ చేసినట్లు మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.
నిందితుల వద్ద నుండి సుమారు 10 తులాల బంగారం మరియు నేరాలకు ఉపయోగించిన కియా కారెన్స్ కారు (నెం: HR16AB6156) స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
నిందితుల వివరాలు:
A-1 సందీప్ – భివానీ జిల్లా, హర్యానా (ముఠా నాయకుడు, పాత నేరస్థుడు)
A-2 అశోక్
A-3 ప్రవీణ్
A-4 రాజేష్
A-5 సునీల్ కుమార్
A-6 సచిన్ – కారు డ్రైవర్, పాత నేరస్థుడు
నిందితులు రద్దీగా ఉండే బస్సుల్లో ప్రయాణికుల్లా ఎక్కి, ఒంటరి మహిళలు లేదా బంగారం ఉన్న బ్యాగులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడేవారని తెలిపారు. ప్రయాణికుల మధ్య హడావిడి సృష్టిస్తూ, ఆ సమయంలో షార్ప్‌నర్ కత్తితో బ్యాగులను కట్ చేసి లేదా జిప్ తెరిచి బంగారం దొంగిలించి, బస్సు కదులుతుండగానే దిగిపోయి కారులో పరారయ్యేవారని వెల్లడించారు.
ఈ ముఠా 07.05.2026 న జడ్చర్ల నేతాజీ చౌరస్తా వద్ద ఒక మహిళ బస్సు ఎక్కిన అనంతరం ఆమె బ్యాగులోని బంగారాన్ని దొంగిలించి కర్నూల్ వైపు పారిపోయింది. అలాగే 18.05.2026 న జడ్చర్ల బస్ స్టాండ్ వద్ద ఆటోలో వచ్చిన ప్రయాణికులను వెంబడించి, ఫ్లైఓవర్ సమీపంలో బ్యాగ్ కట్ చేసి బంగారం దొంగిలించి పరారైనట్లు తెలిపారు.
తేదీ 19.05.2026 ఉదయం మళ్లీ దొంగతనం చేయడానికి జడ్చర్ల బస్ స్టాండ్ సమీపానికి వచ్చిన నిందితులను, వాహన తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్.ఐ కె.మల్లేష్ మరియు సిబ్బంది గుర్తించారు. పోలీసులు కనిపించగానే నిందితులు పారిపోవడానికి ప్రయత్నించగా, పోలీసులు చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి దొంగిలించిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
• కియా కారెన్స్ కారు – HR16AB6156
• బంగారు నెక్లెస్‌లు – 02
• బంగారు కమ్మలు – 07 జతలు
• ముక్కు పుడక – 01
• బంగారు లాకెట్లు – 03
• బంగారు పట్టీలు – 06
• బంగారు ఉంగరాలు – 03
• మొత్తం సుమారు 10 తులాల బంగారం
నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.
ఈ కేసును సమర్థవంతంగా ఛేదించి అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసిన జడ్చర్ల ఇన్స్పెక్టర్ కమలాకర్, ఎస్.ఐ కె.మల్లేష్, సిబ్బంది విష్ణుమూర్తి (పిసి-368), నరసింహరాజు (పిసి-1233)లను జిల్లా ఎస్పీ డి జానకి, IPS ప్రత్యేకంగా అభినందించారు.
#MahabubnagarPolice
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >