Posted on 2026-05-20 23:54:05
డైలీ భారత్, బోయినపల్లి: సికింద్రాబాద్ బోయినపల్లి పోలీస్ స్టేషన్ మహిళా ఎస్సై, రైటర్ లంచం ( Bribe ) తీసుకుంటూ ఏసీబీ ( ACB ) అధికారులకు పట్టుబడ్డారు. ప్రేమ వివాహం చేసుకుని, తన తల్లిదండ్రులు ఒప్పుకోవడంలేదని సహాయం కోసం అభిషేక్ అనే యువకుడు పోలీసులను ఆశ్రయించాడు.
అయితే తల్లిదండ్రులతో మాట్లాడుకోవాలని పోలీస్ స్టేషన్‌కు రావాలని ఎస్సై నందిత పిలిచి డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో డబ్బులు ఇచ్చేందుకు అభిషేక్ నిరాకరిం చడంతో, తండ్రిని కొట్టాడని అభిషేక్‌పై కేసు నమోదు చేసి జైలు ( Jail ) కు పంపారు.
జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాక ప్రతీ సోమవారం సంతకం చేసేందుకు స్టేషన్‌కు వస్తున్న అభిషేక్‌ను రైటర్ విజయ్ రూ.10 వేలు , ఎస్సై నందిత రూ.30 వేలు డిమాండ్ చేశారు. దీంతో విసిగిపోయిన బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
ఏసీబీ అధికారుల సూచనలతో లంచం ఇచ్చేందుకు బాధితుడు రాగా అతడికి తన స్కూటీ తాళం ఇచ్చి డిక్కీలో డబ్బులు పెట్టమని ఎస్సై సూచించారు. బాధితుడు స్కూటీలో డబ్బులు పెట్టగానే, ఎస్సై నందితను, రైటర్ విజయ్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >