| Daily భారత్
Logo




ధాన్యం నిల్వ చేసేందుకు గోదాంలను సిద్ధం చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

News

Posted on 2026-05-20 18:08:16

Share: Share


ధాన్యం నిల్వ చేసేందుకు గోదాంలను సిద్ధం చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

ధాన్యం తరలించేందుకు వాహనాలు, లోడింగ్, అన్ లోడింగ్ కు హమాలీల సంఖ్యను ఇంకా పెంచాలి.

ధాన్యం కొనుగోలు ప్రక్రియపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్.

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : ధాన్యం నిల్వ చేసేందుకు జిల్లాలో అందుబాటులో ఉన్న గోదాంలను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. 

ధాన్యం సేకరణ, గోదాంల వినియోగం, తూకం వేసిన బస్తాల తరలింపు, వాహనాలు, హమాలీల సంఖ్య పెంపు, మిల్లుల్లో ధాన్యం అన్ లోడింగ్, ఆన్ లైన్ ట్యాబ్ ఎంట్రీ వేగవంతం చేయడం, సన్న రకాల సాగుపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడం, తదితర అంశాలపై బుధవారం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, పౌర సరఫరాల, సహకార శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, మెప్మా, వ్యవసాయ, తదితర శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో ఇప్పటి వరకు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగుతుందని, చివరి గింజ వరకు కొనుగోలు చేసేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని, రైతులకు క్షేత్ర స్థాయిలో భరోసా కల్పించాలని అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రోజువారీగా సేకరణలో పురోగతి పెంచడంపై దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఉన్న గోదాంలను వినియోగంలోకి తీసుకువచ్చి, ధాన్యం నిల్వ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. తూకం వేసిన ధాన్యం బస్తాలను వాహనాల ద్వారా తరలించడం, దీని కోసం సరిపడా వాహనాలు సమకూర్చేలా సంబంధిత ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. హమాలీల సంఖ్యను మరింత పెంచి ధాన్యం లోడింగ్, మిల్లులు, అపరల్ పార్కులో అన్ లోడింగ్ చేయడంలో వేగం పెంచాలని ఆదేశించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించి ఆన్ లైన్ ట్యాబ్ ఎంట్రీ ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని ఆదేశించారు. సన్న రకం వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, వచ్చే సీజన్ లో రైతులు సన్న రకం వరి సాగు చేసేలా సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో అవగాహన, విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. 

అకాల వర్షాలు పడితే ఇబ్బందులు కలగకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, త్వరితగతిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి చేసేలా అధికారులు పని చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >
Image 1

దివ్యాంగుల వైద్యానికి ఆర్థిక సహాయం

Posted On 2026-06-12 21:34:48

Readmore >
Image 1

సానిటేషన్ సిబ్బంది సేవలను గుర్తించి అభినందించిన ఆలయ ఈవో

Posted On 2026-06-12 20:23:57

Readmore >