| Daily భారత్
Logo




ధాన్యం అన్ లోడింగ్ కోసం హమాలీల సంఖ్య పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

News

Posted on 2026-05-21 11:42:53

Share: Share


ధాన్యం అన్ లోడింగ్ కోసం హమాలీల సంఖ్య పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

ధాన్యం కొనుగోలు ప్రక్రియపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : ధాన్యం అన్ లోడింగ్ చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని, హమాలీల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ధాన్యం సేకరణ, తూకం వేసిన బస్తాల తరలింపు, వాహనాలు, హమాలీల సంఖ్య పెంచడం, మిల్లుల్లో ధాన్యం అన్ లోడింగ్, ఆన్ లైన్ ట్యాబ్ ఎంట్రీ వేగవంతం చేయడం, తదితర అంశాలపై గురువారం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, పౌర సరఫరాలు, సహకార శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, మెప్మా, వ్యవసాయ, తదితర శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ముఖ్యంగా ఇప్పటికే లారీలు, ట్రాక్టర్ల ద్వారా మిల్లులకు అపరెల్ పార్క్ కు తరలించిన వాహనాలు అన్ లోడ్ చేయడం వేగవంతం చేయాలని  ఆదేశించారు. ఎన్ని వాహనాలు మిల్లుల వద్ద ఉన్నాయో సంబంధిత అధికారులను ఆరా తీశారు. గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. వర్షాలు పడితే కొనుగోలు చేసిన ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు బాధ్యతగా వ్యవహరించాలని, ఆన్ లైన్ ట్యాబ్ ఎంట్రీ వేగవంతం చేసేలా పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >