| Daily భారత్
Logo




దొంగ SC సర్టిఫికేట్ లు తీసుకున్న వారిపై కటిన చర్యలు తీసుకోవాలి

News

Posted on 2026-05-24 07:40:29

Share: Share


దొంగ SC సర్టిఫికేట్ లు తీసుకున్న వారిపై కటిన చర్యలు తీసుకోవాలి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలో కొంత మంది క్రైస్తవ మతంలోకి మారిన వారు తాసిల్దార్ కార్యాలయంలో తాము హిందువులమే అని అబద్ధం చెప్పి తప్పుడు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకుని ప్రభుత్వాన్ని, రాజ్యాంగాన్ని మోసం చేస్తున్నారని.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 మరియు రాజ్యాంగంలోని రాష్ట్రపతి ఉత్తర్వులు 1950 ప్రకారం షెడ్యూల్ కులాల వారు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే వారు బీసీ-సీ గా పరిగణించబడతారు, కానీ పాల్వంచ మండలంలోని చాలామంది షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు క్రైస్తవ మతాన్ని స్వీకరించి యధావిధిగా తాసిల్దార్ కార్యాలయంలో "తాము హిందువులమే" అని అబద్ధం చెప్పి తప్పుడు ఎస్సీ కుల దృవీకరణ పత్రాలు పొంది నిజమైన ఎస్సీలకు దక్కాల్సిన రాజ్యాంగ ఫలాలు అక్రమంగా అనుభవిస్తున్నారని, ఇటువంటి వారిపై సమగ్ర విచారణ జరిపి వారి తప్పుడు SC కుల ధ్రువీకరణ పత్రాలను రద్దు చేయవలసిందిగా ఈరోజు పాల్వంచ లోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ గారికి విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ఖమ్మం విభాగ్ సంఘటన కార్యదర్శి గడిదేసి వెంకటేశ్వర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంఘటన కార్యదర్శి గంగాధరి సీత, పాల్వంచ ప్రఖండ అధ్యక్షులు గుగులోతు లింక నాయక్, పాల్వంచ ప్రఖండ ఉపాధ్యక్షులు చల్లా లింగన్న, పాల్వంచ ప్రఖండ కార్యదర్శి దాసరి మాధవరావు, పాల్వంచ ప్రఖండ సహ కార్యదర్శి వేములపల్లి ప్రవీణ్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-14 13:11:06

Readmore >