| Daily భారత్
Logo




రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులుగా గడ్డం రాజశేఖర్ నియామకం

News

Posted on 2026-05-24 07:44:38

Share: Share


రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులుగా గడ్డం రాజశేఖర్ నియామకం

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకొత్తగూడెంతెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ (ఎమ్మెల్యే మానకొండూరు) హైదరాబాద్ గాంధీభవన్‌లో  రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుల నియామకాన్ని ప్రకటించారు.  భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం నియోజకవర్గం, రామవరం ప్రాంతానికి చెందిన గడ్డం రాజశేఖర్  రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఈ నియామకం పట్ల జిల్లా కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.తరతరాలుగా కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన గడ్డం రాజశేఖర్ విద్యార్థి దశ నుంచే పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. 2018లో NSUI కొత్తగూడెం నియోజకవర్గ జనరల్ సెక్రెటరీగా సేవలందించారు. 2020లో జరిగిన యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేసి జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. అనంతరం 2024 యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో జిల్లా అధ్యక్ష పదవికి పోటీ చేసి, ప్రస్తుతం జిల్లా ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. వారి సేవలను గుర్తించి రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్ష పదవి కల్పించడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.ఈ సందర్భంగా  గడ్డం రాజశేఖర్  మాట్లాడుతూ, "పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువజన కాంగ్రెస్ మరియు టీపీసీసీ పిలుపు మేరకు అనేక కార్యక్రమాలను నిర్వహించాను. పార్టీ అధికారంలోకి రావడానికి నా వంతు కృషి చేశాను. నా సేవలను గుర్తించి ఈ బాధ్యత అప్పగించిన రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ(ఎమ్మెల్యే మానకొండూరు)  హృదయపూర్వక ధన్యవాదాలు. మరియు రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు యేసుపాదం థామస్  హృదయపూర్వక ధన్యవాదాలు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఎస్సీల హక్కుల సాధనకు, పార్టీ బలోపేతానికి నా శక్తి మేరకు కృషి చేస్తాను" అని తెలిపారు.ఈ అవకాశం కల్పించేందుకు సహకరించిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క  రెవెన్యూ శాఖ మంత్రి  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , వ్యవసాయ శాఖ మంత్రి  తుమ్మల నాగేశ్వరరావు , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోటా దేవి ప్రసన్న , తెలంగాణ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోదెం వీరయ్య  ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >