Posted on 2026-05-27 18:14:38
కనీస వేతనం నెలకు 26 వేలు చెల్లించాలి
గ్రామ దీపీకలకు ఉద్యోగ భద్రత కల్పించాలి
ఐద్వా వైరా డివిజన్ కార్యదర్శి గుడిమెట్ల రజిత
గ్రామ దీపీకల దీక్షలకు ఐద్వా సంఘీభావం
డైలీ భారత్, వైరా: దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న గ్రామ దీపీకల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఐద్వా వైరా డివిజన్ కార్యదర్శి గుడిమెట్ల రజిత అన్నారు. కనీస వేతనం నెలకు 26000 వేలకు పెంచాలని, అర్హులైన గ్రామ దీపికలకు సీసీగా పదోన్నతి కల్పించాలని, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని, జీవో నెంబర్ 58 సవరించాలని పలు సమస్యల పరిష్కారం కోసం గ్రామ దీపీకలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 6 రోజుకు చేరుకున్నాయి. బుధవారం గ్రామ దీపీకల దీక్షా శిబిరాన్ని ఐద్వా వైరా డివిజన్ కార్యదర్శి గుడిమెట్ల రజిత, డివిజన్ నాయకురాలు కంసాని మల్లికాంబ సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఐద్వా వైరా డివిజన్ కార్యదర్శి
డిమెట్ల రజిత మాట్లాడుతూ కనీస వేతనం 26 వేలుకు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని గ్రామ దీపీకలు చేస్తున్న పోరాటానికి ఐద్వా సంపూర్ణ మద్దతు తెలుపుతుందని అన్నారు. గ్రామ దీపికలు గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సమాఖ్యల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి, ప్రభుత్వ పథకాల గురించి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం, మహిళా సంఘాలను బలోపేతం చేయడం వంటి బాధ్యతలను గ్రామ దీపీకలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం గ్రామ దీపికలకు తగిన వేతనాలు ఇవ్వకపోవడం, ఉద్యోగ భద్రత కల్పించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామ దీపికల సమస్యలను పరిష్కరించాలి. వేతనాలను పెంచడంతో పాటు వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి స్థిరమైన ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వి.ఓ. యూనియన్ అధ్యక్షురాలు పద్మావతి, కార్యదర్శి శైలజ, ఉపాధ్యక్షురాలు బబిత, షేక్. షైనాబి, ప్రభావతి, నిర్మల, మమతా, తేజ ప్రభావతి సంజు, రమాదేవి రాధా, మణి, మల్లీశ్వరి, విజయలక్ష్మి, స్రవంతి గద్దె నీరజ, మేరీ, నాగమణి తదితరులు పాల్గొన్నారు
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >