| Daily భారత్
Logo




ఫరీద్‌పేట్‌లో సర్పంచ్‌పై గ్రామస్థుల తిరుగుబాటు

News

Posted on 2026-05-29 23:47:16

Share: Share


ఫరీద్‌పేట్‌లో సర్పంచ్‌పై గ్రామస్థుల తిరుగుబాటు

100 మంది గ్రామస్థుల మద్దతు..

మాజీ సర్పంచ్ భాగ్యమ్మ హయాంలోనే పనులు జరిగాయని అధికారులకు వినతిపత్రం

పోలీసు బందోబస్తు మధ్య విచారణ... సర్పంచ్, వార్డు సభ్యుల మధ్య వాగ్వాదం

డైలీ భారత్, కామారెడ్డి:కామారెడ్డి జిల్లా పాల్వoచ మండలం ఫరీద్‌పేట్ గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం, డూప్లికేట్ బిల్లులు, చేయని పనులకు చెల్లింపులు, ప్రైవేట్ ఆస్తులకు ప్రజా ధనం మళ్లింపుడైలీ భారత్ కామారెడ్డి ఆరోపణలపై శుక్రవారం నిర్వహించిన జాయింట్ ఎంక్వైరీ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండటంతో పోలీసు బందోబస్తు నడుమ విచారణ చేపట్టారు.

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా ప్రజా పరిషత్ సీఈఓ ఉత్తర్వులతో జిల్లా ఆడిట్ అధికారి, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జిల్లా పంచాయతీ అధికారి, పాల్వంచ మరియు మాచారెడ్డి మండలాల ఎంపీడీఓ లు గ్రామంలో పర్యటించి రికార్డులు పరిశీలించడంతో పాటు సంబంధిత పనుల స్థలాలను సందర్శించారు.

ఈ సందర్భంగా దాదాపు 100 మంది గ్రామస్థులు సంతకాలు చేసిన వినతిపత్రాన్ని విచారణాధికారులకు సమర్పించారు. మాజీ సర్పంచ్ ఆశం భాగ్యమ్మ హయాంలో గ్రామపంచాయతీ నిధులతో ఇప్పటికే పూర్తయిన డ్రైనేజీలు, సీసీ రోడ్లు మరియు ఇతర అభివృద్ధి పనులను మళ్లీ కొత్త పనులుగా చూపించి నర్సింహ రెడ్డి బిల్లులు డ్రా చేసినట్లు ఆరోపించారు. గ్రామ ప్రజల తరఫున సమర్పించిన ఫిర్యాదులో రూ.9,61,937 విలువైన పనులపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

విచారణ సందర్భంగా గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ అభిప్రాయాలను అధికారులకు వివరించారు. కొన్ని సందర్భాల్లో సర్పంచ్ జీడిపల్లి నర్సింహారెడ్డి,  ఫిర్యాదుదారుడు మధుసుధాన్ రెడ్డి నీ తన ముందుకి తీసుకొని వచ్చిన తర్వాతే విచారణ చేయాలని చెప్పడంతో  వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు జోక్యం చేసుకుని విచారణను కొనసాగించారు.

మరోవైపు వార్డు సభ్యులు కూడా ప్రత్యేకంగా వినతిపత్రం సమర్పించి, గ్రామ పంచాయతీ నిధుల వినియోగం, తీర్మానాలు, రికార్డుల నిర్వహణ, వార్డు సభ్యులకు సమాచారం ఇవ్వకపోవడం వంటి అంశాలపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు.

విచారణ సందర్భంగా గ్రామస్థులు "నీ సొంత అల్లుడే నువ్వు చేసిన అవినీతిని బయటకు తీసుకొస్తున్నాడు" అంటూ చేసిన వ్యాఖ్య అక్కడ చర్చనీయాంశంగా మారింది. దీంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

విచారణ అనంతరం అధికారులు మాట్లాడుతూ, ఫిర్యాదుదారులు, గ్రామస్థులు, వార్డు సభ్యులు మరియు సంబంధిత వ్యక్తుల వాదనలు విన్నామని, సంబంధిత రికార్డులను పరిశీలించామని, పనుల స్థలాలను సందర్శించి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించామని తెలిపారు. పూర్తి స్థాయి నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పించి, తదుపరి చర్యల కోసం పంపనున్నట్లు వెల్లడించారు.

గ్రామస్థులు, వార్డు సభ్యులు మాట్లాడుతూ, విచారణలో ఆరోపణలు నిజమని తేలితే సంబంధిత ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు మరియు బాధ్యులైన అధికారులపై క్రిమినల్, పరిపాలనా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.

Image 1

పోలీసు ఉద్యోగంలో క్రమశిక్షణతో పాటు దాతృత్వం..

Posted On 2026-06-16 13:25:04

Readmore >
Image 1

ఉద్యోగ ఒత్తిడితో యువతి ఆత్మహత్య

Posted On 2026-06-16 13:07:06

Readmore >
Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >