Posted on 2026-05-31 18:00:17
డైలీ భారత్, తాడురు: నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తాడురు ఆవరణలో2002-03 లో పదవ తరగతి బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించడం జరిగింది ముందుగా సరస్వతి శ్లోకం తో ప్రారంభించడం జరిగింది. తదనంతరం ఒక్కొక్కరుగా వారి వారి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు ఇందులో పాల్గొన్న ఉపాధ్యాయులు రిటైర్డ్ పీజీ హెడ్మాస్టర్ మోతే దేవి రెడ్డి మడ్డికుంట లక్ష్మణ్ గార్లు మాట్లాడుతూ వారు చేసినటువంటి సేవలు నెమరు వేసుకున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా గోరుముద్ద కార్యక్రమాన్ని ఈ పాఠశాలలో 2002లోనే ప్రారంభించడం జరిగింది అని తెలియచేశారు అదేవిధంగా గ్రామస్తుల సహకారంతోటి కన్నబిడ్డకు పురిటి గడ్డ సన్మానం కూడా పెద్ద ఎత్తున గ్రామంలోనీ వారు వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి సన్మాన కార్యక్రమం చేయడం జరుగుతూ వచ్చిందని గుర్తు చేసుకున్నారు అమ్మాయిలు తంగళ్ళపల్లి వరకు నడిచి వెళ్లలేక పాఠశాల చదువు మాని వేస్తున్నారని ఇక్కడ యుపిఎస్ గా ఉన్నటువంటి పాఠశాలను హైస్కూల్ గా మార్చడం జరిగిందని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో పూర్వ ప్రధానోపాధ్యాయులు మద్దికుంట లక్ష్మణ్, మోతే దేవిరెడ్డి ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు బూర రవీందర్ మరియు ఉపాధ్యాయులు గా పని చేసినటువంటి వారు రవీందర్ రెడ్డి బోయన్న గారి నారాయణ కలకుంట్ల రాజేశ్వర్ రావు సిద్ధంశెట్టి శ్రీనివాస్ పిల్లి ధర్మయ్య గుర్రం అంజయ్యలు ఆఫీస్ సబార్డినేట్ గా పనిచేసిన నరసయ్య చంద్రమ్మ లను పూర్వ విద్యార్థులు సన్మానం చేసి జ్ఞాపికలు అందజేశారు గోగు నాగరాజు మమత సుకన్య శేఖర్ జీవిత ముడారి వనిత జ్యోతి తదితరులు పాల్గొన్నారు
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >