| Daily భారత్
Logo




హెల్త్ కార్డుల కోసం జీతంలో కోత విధించడం సరికాదు

News

Posted on 2026-05-31 18:02:37

Share: Share


హెల్త్ కార్డుల కోసం జీతంలో కోత విధించడం సరికాదు

ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలి..లేనిచో ఉద్యమం తప్పదని TPTF రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దుమాల రమనాధ్ రెడ్డి హెచ్చరిక

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఆరోగ్య కార్డులకు సంబంధించి అధికారికంగా ఎలాంటి కార్డులు జారీ కాకుండా నే ముందస్తుగానే ఆర్థిక శాఖ మే నెల జీతం లో కోతలు విధించడం తీవ్రంగా ఆక్షేపిస్తున్నట్టు వారు తెలిపారు,  ఇంతవరకు ఆర్థిక శాఖ  విధివిధానాలను ప్రకటించకుండానే, ఏ హాస్పిటల్స్ ఈ యొక్క స్కీం కింద వర్తిస్తాయో తెలుపకుండానే, ఎలాంటి వ్యాధులకు సంబంధించి చికిత్సలు చేస్తారో తెలుపకుండానే ముందస్తుగా ఉద్యోగుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే కోతలు విధించారు.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వారు తెలిపారు.

ఆరోగ్యశాఖ సంబంధించిన వెబ్సైట్లో ఉద్యోగుల వివరాలు కూడా పూర్తిగా నమోదు కాలేదని ఈరోజు వరకు నమోదు చేయడానికి అవకాశం ప్రభుత్వం ఇచ్చిందని ఇంతవరకు పూర్తిగా నమోదు కాకుండానే ఏ విధంగా కోత విధిస్తారని వారు ప్రశ్నించారు,

భార్యాభర్తలు ఉద్యోగులైన పక్షంలో ఏ విధంగా నమోదు చేసుకోవాలో ఇంతవరకు ఎలాంటి పూర్తిస్థాయి వివరణ అందుబాటులో ఉంచలేదని అదేవిధంగా నిన్నటి వరకు కూడా వెబ్సైట్లో చాలా మార్పులు చేస్తున్నారని ఇంకా పూర్తిస్థాయి మార్పులు కూడా చేయాల్సిన అవసరం ఉందని  అధికారులు తెలియజేస్తున్న తరుణంలో చడి చప్పుడు లేకుండా జీతంలో కోత విధించడం అన్యాయమని వారు చెప్పారు.

ఇప్పటికైనా ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాల ద్వారా అభిప్రాయాలను సేకరించి ఆరోగ్య కార్డుల జారీలో మార్గదర్శకాలు తయారు చేసి విడుదల చేయాలని.. ప్రత్యేకంగా ఎవరైతే ఈ పథకంలో చేరడానికి ఆసక్తి చూపుతారో వారికే కోత విధించాలని ఇష్టం లేని వారికి కోత విధించకుండా నిబంధనలు తయారు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం తనకు తానుగా ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్యానికి సంబంధించి రక్షణ తీసుకోవాల్సిన బాధ్యత నుంచి తప్పించుకునే క్రమంలో ఒక కొత్త విధానానికి శ్రీకారం చుడుతూ ఉద్యోగుల నుంచి ప్రీమియం చెల్లింపును కోరింది.. అయినా కొన్ని సంఘాలు ఆ విధానానికి ఒప్పుకోలేదు.

అయినా ప్రభుత్వం ఆరోగ్య కార్డులు జారీకి సిద్ధమైంది కానీ అందరూ ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు కొరకు కోత విధించడం అన్యాయమని ఉద్యోగుల దగ్గర ఆప్షన్ తీసుకొని మాత్రమే కోతలు విధించాలని డిమాండ్ చేస్తున్నామని వారు తెలిపారు

అంతేకాకుండా ఇప్పుడునెల జీతం లో ముందస్తుగానే కోత విధించారనీ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని విధించిన కోతను మళ్ళీ రేపు జీతంలో కలిపి చెల్లించాలని వారు డిమాండ్ చేశారు..

లేనిచో పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధమవుతున్నామని వారు తెలిపారు..

Image 1

150 ట్రాక్టర్ల లోడుల ఇసుక స్వాధీనం

Posted On 2026-06-16 07:15:20

Readmore >
Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >