Posted on 2026-06-01 11:10:15
వాహనాలు, హమాలీల సంఖ్యను మరింత పెంచాలి
ధాన్యం కొనుగోళ్లపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో మరింత వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ, అపరెల్ పార్క్, రైస్ మిల్లులు, గోదాంలలో అన్ లోడింగ్ వేగవంతం చేయడం, ఆన్ లైన్ ట్యాబ్ ఎంట్రీ పురోగతి, తదితర అంశాలపై అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, పౌర సరఫరాలు, సహకార శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, మెప్మా, రవాణా, తదితర శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ సోమవారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం ఉన్న బస్తాలను వెంటనే అపరెల్ పార్క్, రైస్ మిల్లులు, గోదాములకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గన్నీ సంచులు, కొనుగోలు కేంద్రాల్లో చేస్తున్న ట్యాబ్ ఎంట్రీ, తదితర వివరాలు ఆరా తీశారు.
కొనుగోళ్ళు పూర్తయిన కేంద్రాల నుంచి వాహనాలు, హమాలీలను అపరెల్ పార్క్ కు పంపించి, అన్ లోడింగ్ వేగవంతం చేయడంపై దృష్టి సారించాలని, వాహనాలను ఇతర కేంద్రాలను తరలించాలని సూచించారు. సాధ్యమైనంత త్వరగా కొనుగోళ్ళు సజావుగా పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లు సరిపడా వాహనాలు సమకూర్చేలా ఆదేశాలు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >