Posted on 2026-06-02 16:13:35
డైలీ భారత్, కామారెడ్డి : జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా ప్రాంతంలోని కానిస్టేబుల్ కిష్టయ్య విగ్రహానికి నివాళులు అర్పించిన మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు అయినటువంటి కానిస్టేబుల్ కిష్టయ్య విగ్రహానికి అభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది . మలి దశ తెలంగాణ ఉద్యమం ఉధృతమైన సందర్భంలో కిష్టయ్య కానిస్టేబుల్ గా కామారెడ్డి విధులు నిర్వహిస్తూ, ఆంధ్రపాలకుల పాలనలో వారు చేస్తున్న ఆకృత్యాలకు విధిస్తున్న నిర్బంధాలకు చలించి, కానిస్టేబుల్ గా తెలంగాణ ఉద్యమకారులను చెదరగొట్టలేక, విధులు నిర్వర్తించలేక తీవ్ర మనస్తాపం చెంది డ్యూటీలో ఉండగానే సెల్ టవర్ ఎక్కి తుపాకీతో కాల్చుకొని అమరుడు అవ్వడం జరిగింది.
శ్రీకాంత్ చారి మరణానికి మూడు రోజుల ముందే మరణించినటువంటి కానిస్టేబుల్ కిష్టయ్యను తెలంగాణ మలిదశ తొలి ఉద్యమకారుడిగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని చరిత్రలో తన పేరు తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుండాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గ్యార అఖిల, కొత్తపల్లి లలిత చిట్టిబాబు,బిసీ సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు,సభావత్ వినోద్ నాయక్,ఆర్మీ జవాన్ నరేందర్,మదన్, ప్రశాంత్,దేవరాజు తదితరులు పాల్గొన్నారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >